Shivam Bhaje: అశ్విన్ బాబు 'శివం భజే'.. నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ ఎవ‌రంటే?

ABN, Publish Date - Jul 29 , 2024 | 01:22 PM

'హిడింబ' వంటి సూప‌ర్ హిట్ చిత్రం త‌ర్వాత‌ అశ్విన్ బాబు న‌టించిన నూత‌న సినిమా 'శివం భజేస‌. తాజాగా ఈ 'శివం భజే' చిత్రాన్ని నైజాం ఏరియాలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు 'మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి ముందుకొచ్చింది.

Shivam Bhaje

'హిడింబ' వంటి సూప‌ర్ హిట్ చిత్రం త‌ర్వాత‌ అశ్విన్ బాబు (Ashwin Babu) న‌టించిన నూత‌న సినిమా 'శివం భజే' (Shivam Bhaje). దిగంగనా సూర్యవంశీ (Digangana Suryavanshi) క‌థానాయిక‌గా న‌టించ‌గా, బాలీవుడ్ న‌టుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan), హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. అప్స‌ర్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా గంగా ఎంటర్టైన్మంట్స్ (Ganga Entertainments) భారీ బ‌డ్జెట్‌తో నిర్మించింది.

ఆగస్టు 1న ఈ సినిమా ప్ర‌ప‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ ఇప్ప‌టికే మూవీ ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో అనూహ్యమైన స్పందనను రాబ‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్ కూడా సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింతగా పెంచేశాయి. తాజాగా ఈ 'శివం భజే' చిత్రాన్ని నైజాం ఏరియాలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు 'మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి (Mythri Movie Distributors LLP) ముందుకొచ్చింది.


ట్రైలర్ లో చూపించినట్టుగా ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని అర్థమైంది. వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు, అప్సర్ (Apsar) దర్శకత్వం ఇలా ఎన్నో హైలెట్స్ గా న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

Updated Date - Jul 29 , 2024 | 02:30 PM