Mufasa The Lion King: బలవంతుడికి మరింత బలం చేకూరింది.. ముఫాసా
ABN, Publish Date - Nov 20 , 2024 | 04:42 PM
అల్టిమేట్ జంగిల్ కింగ్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు రిలీజ్ విషయంలో బలవంతుడికి మరింత బలం చేకూరినట్లైంది. ఇప్పటికే ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తుండగా మరింత బలం చేకూరింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
అల్టిమేట్ జంగిల్ కింగ్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) లెగసీని గొప్పగా సెలబ్రేట్ చేసుకునే సమయం ఆసన్నమైంది. 2019లో లైవ్-యాక్షన్ ‘ది లయన్ కింగ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ, విజువల్‌గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదల సమయం దగ్గరపడుతున్న వేళా తెలుగులోనూ మూవీ మేకర్స్ బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘ముఫాసా' క్యారెక్టర్‌కి వాయిస్ అందించేందుకు సూపర్ స్టార్ మహేష్ పేరు ఖరారైన విషయం తెలిసిందే. అయితే మరిన్ని ముఖ్యపాత్రలకి కూడా టాప్ యాక్టర్స్ వాయిస్ అందించనున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరెవరంటే..
‘ముఫాసా’ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనుండగా ఆయనతో పాటు ప్రముఖ నటులు బ్రహ్మానందం పుంబాగా, అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నారు. ఇక ‘ముఫాసా’ తండ్రి పాత్ర కిరోస్‌కి కేజీఎఫ్ సినిమాలో వానరంగా కనిపించిన అయ్యప్ప శర్మ వాయిస్ అందించనున్నారు. ఇక కథలో మెయిన్ విలన్ స్కార్ అలియాస్ టక పాత్రకి యాక్టర్ సత్యదేవ్ వాయిస్ అందించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఇలాంటి బలమైన వాయిస్ అదనపు అంచనాలను యాడ్ చేయనున్నాయి.
ఇక ఈ అద్భుతమైన అసోసియేషన్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. “డిస్నీ బ్లాక్‌బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, టైమ్‌లెస్ స్టోరీ టెల్లింగ్ నాకెంతో ఇష్టం. ముఫాసా పాత్ర తన కొడుకును నడిపించే ప్రేమగల తండ్రిగా మాత్రమే కాకుండా అడవికి రారాజు బాధ్యతాయుతంగా ఉంటుంది. డిస్నీతో ఈ అసోసియేషన్ వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది, ఇది నా పిల్లలతో నేను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్. డిసెంబర్ 20న తెలుగులో బిగ్ స్క్రీన్‌పై ‘ముఫాసా: ది లయన్ కింగ్’ను నా కుటుంబంతో కలిసి నేను, అలాగే నా అభిమానులు చూస్తారని ఎదురు చూస్తున్నాను’’ అని అన్నారు.