Mrunal Thakur: ముద్దు సన్నివేశాల గురించి మృణాల్ ఏమన్నారంటే!
ABN, Publish Date - Apr 29 , 2024 | 01:18 PM
'సీతారామం’లో సీత పాత్రతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు మృణాల్ ఠాకూర్(mrunal Thakur) . తన నటనతో అభిమానుల్ని సొంతం చేసుకుని వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె ముద్దు సన్నివేశాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
'సీతారామం’లో సీత పాత్రతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు మృణాల్ ఠాకూర్(mrunal Thakur) . తన నటనతో అభిమానుల్ని సొంతం చేసుకుని వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె ముద్దు సన్నివేశాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘రొమాంటిక్ (Romantic scene) సన్నివేశాల్లో నటించడం నాకు సౌకర్యవంతంగా ఉండదు. ముద్దు సన్నివేశాలు ఉన్న కారణంగా కొన్ని సినిమాలు వదులుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో నటించడం నా తల్లిదండ్రులకు నచ్చదు. అందుకే నో చెప్పాను. అటువంటి సన్నివేశాల్లో నన్ను చూస్తే వాళ్లు ఏమనుకుంటారో అని భయం వెంటాడేది. అది కథలో భాగమేనని మంచి పాత్ర అయినప్పుడు ఈ కారణంగా సినిమాలో వదులుకోలేనని వాళ్లకు వివరించాను. నా మాటలకు కన్విన్స్ అయ్యి అంగీకరించారు. కానీ, మొదట్లో ఆ సన్నివేశాలకు నో చెప్పడం కారణంగా ఎన్నో మంచి అవకాశాలు చేజారిపోయాయి’ అని మృణాల్ అన్నారు.
మరో ఇంటర్వ్యూలో తన కెరీర్ బిగినింగ్ డేస్ గురించి చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజుల్లో ఓ భారీ ప్రాజెక్ట్ అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని వదులుకున్నాను’’ అని అన్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఇంటిమేట్ సీన్స్ ఉన్న కారణంగానే ఆ భారీ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేసిందని భావిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఫ్యామిలీస్టార్ చిత్రం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతోంది.
Sai Durga Tej: ఈసారి విభిన్న కథాంశంతో..
Read More: Tollywood, Cinema News