మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mr Bachchan: భారీ మీటింగ్‌ నేపథ్యంలో.. షూట్‌!

ABN, Publish Date - May 12 , 2024 | 04:49 PM

షాక్‌, మిరపకాయ్‌ చిత్రాలతో అలరించిన హరీష్‌ శంకర్‌ రవితేజ హీరోగా హ్యాట్రిక్‌ అందుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో  తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’.

షాక్‌, మిరపకాయ్‌ చిత్రాలతో అలరించిన హరీష్‌ శంకర్‌(Harish Shankar), రవితేజ (Ravi teja) హీరోగా హ్యాట్రిక్‌ అందుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో  తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan). పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కొన్ని నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం మొదలైంది. తమిళనాడులోని కారైకుడిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఓ భారీ మీటింగ్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రవితేజతోపాటు కథానాయిక భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, తనికెళ్ల భరణి, పంకజ్‌ కేసరి, సత్యం రాజేశ్‌ తదితరులపై ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - May 12 , 2024 | 04:49 PM