Film nagar Daiva Sannidhanam: మోహన్ బాబు వర్సెస్ స్వరూపానంద అసలు ఏం జరిగింది ?
ABN, Publish Date - Jun 10 , 2024 | 01:30 PM
ఫిలింనగర్ దైవ సన్నిదానం చైర్మన్ పదవిలో సీనియర్ నటుడు మోహన్ బాబు గత ఆరేళ్లుగా కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడా పదవిని మరో సీనియర్ నటులు మురళీమోహన్ చెపట్టనున్నారని తెలుస్తొంది.
ఫిలింనగర్ దైవ సన్నిదానం (FilmNagar Daivasannidhanam) చైర్మన్ పదవిలో సీనియర్ నటుడు మోహన్ బాబు (mohanbabu) గత ఆరేళ్లుగా కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడా పదవిని మరో సీనియర్ నటులు మురళీమోహన్ (muralimohan) చెపట్టనున్నారని తెలుస్తొంది. మోహన్ బాబు స్థానంలో మురళీమోహన్ రావడం వెనుక స్వరూపానందేంద్రస్వామి(swaroopanandendra Swami), మోహన్ బాబు మధ్య ఏర్పడ్డ పొరపొచ్చాలే కారణమని తెలుస్తొంది. తొలి నుంచి విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో ఈ దైవ సన్నిదానం పాలకమండలి ఎంపిక జరుగుతూ ఉంటుంది స్వరూపానందేంద్రస్వామి సమక్షంలోనే గతంలో 12 మంది పాలక మండలి సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాడు చైర్మన్ గా మోహన్ బాబు నియమితులు కాగా, కమిటి సభ్యులుగా నటులు గిరి బాబు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, కృష్ణం రాజు సతీమణి శ్రీమతి శ్యామల, చిరంజీవి సతీమణి సురేఖ, చాముండేశ్వరి నాథ్, వి. రామ్ ప్రసాద్ ఉన్నారు.
అయితే ఈ ఏడాది జనవరిలో మోహన్ బాబు, దైవ సన్నిధానంలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలను చేయించారు. ఈ సందర్భంగానే తమ పాలకమండలి లో సరికొత్త సభ్యులు వచ్చారంటూ వైస్ చైర్మన్ గా కోమటిరెడ్టి వెంకటరెడ్డి సతీమణి లక్ష్మీని ఎనౌన్స్ చేశారు. అయితే ఆ విషయంపై పాలకమండలి లో ఉన్న స్వరూపానందేంద్రస్వామికు సంబంధించిన సభ్యులు, మీరేలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని,ప్రకటన చేస్తారని మోహన్ బాబును అందరి ముందే ప్రశ్నించారని..అనంతరం స్వరూపానంద కూడా తనను అడగకుండా మోహన్ బాబు ఎలా కొత్త సభ్యులను తీసుకుంటారని అగ్రహించారని సమాచారం.
మోహన్ బాబు ను చైర్మన్ పదవి నుంచి తప్పించాల్సిందేనని.. కొత్త పాలకమండలిని , చైర్మన్ గా మురళీమోహన్ ను ప్రకటించాలని ముహూర్తం కూడా సిద్దం చేసుకున్నారు స్వరూపానంద. అయితే రామోజీరావు మరణంతో, ఎనిమిదో తారీకున జరగాల్సి ఉన్న దైవ సన్నిధానం కొత్త పాలకమండలి సభ్యుల బాధ్యతల స్వీకరణ వాయిదా పడింది. అయితే మరొపక్క మోహన్ బాబు పాలకమండలిలో తనకు సపోర్ట్ గా ఉన్న సభ్యులతో సంతకాల సేకరణ చెపట్టారని. మోహన్ బాబునే చైర్మన్ గా కొనసాగించాలన్నది ఆ సంతకాల వెనుకున్న సారాంశం. ఇలా స్వరూపానంద, మోహన్ బాబు ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ, వ్యూహ్యాలను వేసుకుంటూ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పరిస్దితి స్వరూపానందేంద్రస్వామి వర్సెస్ మోహన్ బాబు అన్నట్టుగా మారిందట. అటు స్వరూపానంద ఇటు మోహన్ బాబు ల మధ్య ఈగో వ్యవహారం పాలకమండలి సభ్యులలో ఎప్పుడులేని టెన్షన్ ను క్రియేట్ చేస్తొంది. దైవ కార్యక్రమాలతో అలరారాల్సిన దైవ సన్నిధానం లో ఇప్పుడీ ఈ వ్యవహారం పరిశ్రమ ప్రముఖులను ఆశ్చర్యపరుస్తోంది.