Minister Kandula Durgesh: ఆంధ్రాలో సినిమా అభివృద్ధికి కృషి చేస్తాం!
ABN, Publish Date - Jun 15 , 2024 | 09:33 PM
జనసేన పార్టీ (Janasena), నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌కు (kandula Durgesh) మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే! పర్యాటక, సినిమాటోగ్రఫీ (Cinematogaphy), సాంస్కృతికి శాఖలకు ఆయన్ను మంత్రిగా నియమించారు.
జనసేన పార్టీ (Janasena), నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌కు (kandula Durgesh) మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే! పర్యాటక, సినిమాటోగ్రఫీ (Cinematogaphy), సాంస్కృతికి శాఖలకు ఆయన్ను మంత్రిగా నియమించారు. తాజాగా ఆయన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పర్యాటకంపై దృష్టిపెట్టలేదన్న ఆయన అప్పటి పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె. రోజా కేవలం పవన్ కల్యాణ్‌ని (Pawan kalyan) వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటక శాఖ మంత్రి పని అన్నట్లుగా పని చేశారని విమర్శించారు. తూ.గో జిల్లాను పర్యాటకంగా అభివృద్థి చేస్తామని, అమరావతిలో సినీ అభివృద్థిపై దృష్టి పెడతామని మాటిచ్చారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహాక ప్రాంతాల్లో ఉన్న పట్టణాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. గోదావరి ప్రాంతంలో షూటింగ్ స్పాట్లు ఎక్కువ, రాజమండ్రి సెంట్రల్ పాయింట్‌గా ఉంది.. రాజమండ్రిలో స్టూడియో నిర్మిస్తామని, ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.
గత ప్రభుత్వం అగ్ర హీరోల చిత్రాలకు పలు ఆంక్షలు విధించారు.. ఈ ప్రభుత్వంలో ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు, 'ుూముఖ్యమంత్రి చంద్రబాబుకు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. సినీ రంగాన్ని గతంలో కూడా ఎంతో ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా ఆయన అదే తరహాలో అభివృద్ధి చేస్తారు. సినిమాలకు, సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ఆంక్షలు పెట్టరు’’ అని దుర్గేష్ చెప్పారు.