Biggboss 8 Elimination: బిగ్‌బాస్‌.. మెహబూబ్‌ అవుట్‌.. కారణం ఏంటంటే..

ABN, Publish Date - Oct 28 , 2024 | 09:27 AM

బిగ్‌బాస్‌ సీజన్‌-8(Biggboss-8)లో ఈ వారం ఎలిమినేషన్‌ పూర్తయింది. ఎవరు ఎలిమినేట్‌ కానున్నారనే ఉత్కంఠకు బిగ్‌బాస్‌ తెరదించారు.


బిగ్‌బాస్‌ సీజన్‌-8(Biggboss-8)లో ఈ వారం ఎలిమినేషన్‌ పూర్తయింది. ఎవరు ఎలిమినేట్‌ కానున్నారనే ఉత్కంఠకు బిగ్‌బాస్‌ తెరదించారు. మెహబూబ్‌ (Mehaboob Dil Se) ఎలిమినేట్‌ అయినట్టు ప్రకటించాడు. ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా.. అతి తక్కువ ఓటింగ్‌ వచ్చి ఎలిమినేషన్‌ కాబోయే జాబితాలో నయని పావని, మెహబూబ్‌ నిలిచారు. ఈ ఇద్దరిలో తక్కువ ఓటింగ్‌ వచ్చిన మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చారు. ఎలిమినేషన్‌ అనంతరం మెహబూబ్‌ మాట్లాడుతూ.. ‘సీజన్‌-4లో కూడా దీపావళి సమయంలోనే నేను ఎలిమినేట్‌ అయ్యా. ఇప్పుడూ అదే పండగ వేళ ఎలిమినేట్‌ అయ్యా. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ప్రతి టాస్క్‌లోనూ నా బెస్ట్‌ ఇవ్వాలనే హౌస్‌లోకి వచ్చా. కానీ, దురదృష్టవశాత్తు బయటకు వచ్చేశా’’ అని  భావోద్వేగానికి గురయ్యారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కంటెస్టెంట్‌ అయిన మెహబూబ్‌ వైల్డ్‌కార్డ్‌తో కొత్త సీజన్‌లో అడుగుపెట్టారు.  ఇంటి సభ్యులను టాపాసులతో పోల్చుతూ మెహబూబ్‌ వారితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  


   

నబీల్‌ - తారాజువ్వ
నువ్వు రాకెట్‌లా దూసుకెళ్లాలి.  బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చాక నీ గురించి బాగా అర్థమైంది. నువ్వు బాగా ఆడాలి.

రోహిణి -కాకరవత్తి
అవినాశ్‌- రోహిణి ఉంటే మాకు నవ్వులే నవ్వులు.  రోహిణి.. మీరు బాగా ఆడాలి. మన క్లాన్‌ నుంచి మీరు మళ్లీ చీఫ్‌ అవ్వాలి.

గౌతమ్‌ - అగ్గిపెట్టె
గౌతమ్‌ నీలో ఫైర్‌ ఉంది. దాన్ని బయటకు తీసుకొచ్చి వెలుగు నింపగలవు. ఇంకా బాగా ఆడు.

అవినాశ్‌ - థౌంజడ్‌ వాలా..
హౌస్‌లో ఎప్పుడూ వినోదం పంచుతూ ఉంటాడు. టాస్క్‌ల్లో బాగా ఆడతాడు

లక్ష్మీబాంబ్‌ - గంగవ్వ
అవ్వా.. నిన్ను మిస్‌ అవుతున్నా. నీకు ఏ అవసరం ఉన్నా కాల్‌ చేయ్‌. నేను అండగా ఉంటా. బాధపడకు" అని పేర్కొన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 09:36 AM