మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Megastar Chiranjeevi: అమెరికాలో చిరంజీవి, వెంకీమామ సంద‌డి

ABN, Publish Date - Feb 17 , 2024 | 01:20 PM

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ‌తో క‌లిసి వెకేష‌న్ కోసం రెండు రోజుల క్రితం అమెరికాకు వెళ్లిన విష‌యం తెలిసిందే.

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) భార్య సురేఖ‌తో క‌లిసి వెకేష‌న్ కోసం రెండు రోజుల క్రితం అమెరికాకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే కేంద్రం చిరంజీవికి దేశ రెండో అత్యున్న‌త పుర‌స్కారం ప‌ద్మ‌విభూష‌ణ్ ను ప్ర‌క‌టించి స‌న్మానించ‌గా దేశ వ్యాప్తంగా అభినంద‌న‌ల వెళ్లువ కొన‌సాగింది. ప్ర‌స్తుతం కాస్త విరామం దొర‌క‌డంతో ఆయ‌న usa ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

అమెరికా ప‌ర్య‌ట‌న‌లోనూ బిజీబిజీగా గ‌డుపుతున్న చిరంజీవి (Chiranjeevi Konidela) శుక్ర‌వారం రాత్రి ఆయ‌న క్లోజ్ ఫ్రెండ్ ఎన్అర్ఐ అయిన‌ కుమార్ కోనేరు కుమారుడు కిరణ్ కోనేరు, శైల్య శ్రీల వివాహ వేడుకల్లో పాల్గొని, కొత్త జంటను ఆశీర్వదించారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, సురేఖ దంప‌తుల‌తో పాటు విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు.


ఈ విష‌యం చిరంజీవి (Chiranjeevi Konidela) త‌న సోష‌ల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేయ‌గా నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. ఈ సెల‌బ్రేష‌న్స్‌లో చిరంజీవితో పాటు విక్ట‌రీ వెంక‌టేశ్‌, అల్లు అర‌వింద్ (Allu Aravind), మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) న‌వీన్ ఎర్నేని (Naveen Yerneni), పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత టీజీ విశ్వ ప్ర‌సాద్ (Vishwa Prasad), దుర్గా ఆర్ట్స్ (Durga Arts) అధినేత K L నారాయ‌ణ (K.L Narayana) త‌దిత‌రులు ఉన్నారు.

మ‌రో రెండు రోజుల త‌ర్వాత హైద‌రాబాద్‌కు రానున్న చిరంజీవి ఆ వెంట‌నే విశ్వంభ‌ర (Viswambhara) సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు.

Updated Date - Feb 18 , 2024 | 12:20 PM