Game Changer: సంక్రాంతికి 'మెగా' ప్లాన్
ABN, Publish Date - Oct 12 , 2024 | 10:27 AM
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో విడుదల ఉంటుందనేలా మరో టాక్ వినిపించింది. అయితే ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
2025 సంక్రాంతికి వచ్చే సినిమాల విషయంలో ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. మరీ ముఖ్యంగా సినిమా ప్రారంభం రోజే విడుదల తేదీని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠల ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ‘విశ్వంభర’ స్లాట్‌ని మెగాస్టార్, తన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఇవ్వబోతున్నట్లుగా టాక్ మొదలైంది. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో విడుదల ఉంటుందనేలా మరో టాక్ వినిపించింది. అయితే ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘గేమ్ చేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నప్పుడు క్రిస్మస్ కంటే సంక్రాంతి అయితే బావుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్ సీస్‌లోని ఇతర డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భావించాం. ఈ ఆలోచనను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ సంస్థకు తెలియజేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభర’ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అందువల్ల సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారిని, యువీ వారిని అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. ‘గేమ్ చేంజర్’ సినిమాను సంక్రాంతికి రావటానికి వాళ్ల విశ్వంభర సినిమాను మరో రిలీజ్ డేట్‌కు విడుదల చేయాలనుకున్నారు. నిజానికి విశ్వంభర సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా పూర్తవుతుంది. అయితే నా కోసం, మా సినిమా కోసం వాళ్ల సినిమాను మరో రిలీజ్ డేట్‌కు రిలీజ్ చేయటానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి నా ధన్యవాదాలు. ‘గేమ్ చేంజర్’ సినిమాను సంక్రాంతి విడుదల చేస్తున్నాం. ఇటు అభిమానులకు, అటు సినీ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దతూ రాత్రింబగళ్లు కష్టపడుతున్నాం. ఆల్ రెడీ రెండు పాటలు విడుదలయ్యాయి. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్‌గా వచ్చిన ‘రా మచ్చా మచ్చా..’ యూ ట్యూబ్‌లో మారుమోగిపోతుంది. తర్వాత టీజర్ వస్తుంది. తర్వాత మరో మూడు పాటలను రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజయం సాధించేలా ప్లాన్ చేశాం. అటు రామ్ చరణ్‌గారికి గ్లోబల్ స్టార్ అనే బ్రాండ్ ఏదైతే పడిందో దాన్ని.. గ్లోబల్‌గా ఈ సినిమా విజయం సాధించేలా ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నం ఫలిస్తుంది. సంక్రాంతికి కలుద్దాం’’ అన్నారు.