Mani Sharma: 'మార్ ముంతా ఛోడ్ చింతా' పాట వివాదంపై మణిశర్మ క్లారిటీ!
ABN, Publish Date - Jul 26 , 2024 | 02:55 PM
రామ్ పోతినేని (Ram pothinneni)- పూరి జగన్నాథ్ (Puri Jagannadh)కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double ismart). ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ అనే మాస్ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే!
రామ్ పోతినేని (Ram pothinneni)- పూరి జగన్నాథ్ (Puri Jagannadh)కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double ismart). ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ అనే మాస్ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే! ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ పొందిన ఈ పాటను మణిశర్మ సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. అయితే ఈ పాటలో కేసీఆర్ ఓ సమావేశంలో ఏం చేద్దామంటావ్ మరి’ అనే డైలాగ్‌ను ఉపయోగించడం పట్ల కేసీఆర్ అభిమానులు మండిపడ్డారు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ పాటను నుంచి కేసీఆర్ మాటలను తొలగించాలని డిమాండ్ చేశారు. తాజాగా దీనిపై సంగీత దర్శకుడు మణిశర్మ స్పందించారు.
"కేసిఆర్ అందరికీ ఇష్ణమైన వ్యక్తి. ఆయన పలు సందర్భాల్లో మాట్లాడిని మాటలు మీమ్స్‌లో చాలా పాపులర్ అయ్యాయి. దాన్నే తీసుకుని పాటలో వాడాము. ఉద్దేశపూర్వకంగా వారిని కించపరచాలని, నొప్పించాలని పెట్టలేదు. సంగీత దర్శకుడిగా నా 27 ఏళ్ల కెరీర్‌లో ఎవరినీ నొప్పించలేదు. కేసీఆర్‌ను జస్ట్ ఈ పాటలో తలుచుకున్నామంతే. కేసిఆర్ డైలాగ్‌నుపెట్టడం తప్పుగా భావించవద్దు. అది ఐటెమ్ సాంగ్ కూడా కాదు. హీరోహీరోయిన్ల మధ్య డ్యూయెట్ సాంగ్’’ అని అన్నారు. రామ్ సరసన కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.