మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manchu Vishnu: కేన్స్ లో  కన్నప్ప టీజర్‌ అదిరింది!

ABN, Publish Date - May 21 , 2024 | 04:51 PM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’. ఆయనకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’ (Kannappa). ఆయనకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ముకేశ్‌ కుమార్‌సింగ్‌ (mukesh kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ట్రెలర్‌ను కేన్స్‌లో చ్రిత్రోత్సవాల్లో (Cannes Film Festival) ప్రదర్శించారు. అక్కడ స్పందన అద్భుతంగా ఉందని విష్ణు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

‘‘కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్ర టీజర్‌ను ప్రదర్శించాం. అద్భుతమైన స్పందన వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ దీనిపై ఆసక్తిగా ఉన్నారు. ఇంత గొప్ప రెస్పాన్స్‌ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. భారత్‌లో ఉన్న ఆడియన్స్‌ కోసం ఈ టీజర్‌ను జూన్‌ 13న విడుదల చేయనున్నాం. దీనికంటే ముందు మే 30న ‘కన్నప్ప’ను మొదటినుంచి సపోర్ట్‌ చేస్తున్న వారికోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేయనున్నాం. హైదరాబాద్‌లోని థియేటర్లో దీన్ని ప్రదర్శించనున్నాం. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమైనప్పటి నుంచి సోషల్‌ మీడియాలో నిరంతరం మెసేజ్‌లతో ప్రోత్సహిస్తున్న వారిని త్వరలోనే మా టీమ్‌ సంప్రదిస్తుంది’ అని అన్నారు.

ప్రేక్షకులందరినీ ‘కన్నప్ప’ ప్రపంచంలోకి తీసుకెళ్లడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కేన్స్‌ చిత్రోత్సవంలో దిగిన ఫొటోలను పంచుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే అక్షయ్‌కుమార్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల ప్రభాస్‌ సెట్‌లో అడుగుపెట్టారు. వివిధ భాషలకు చెందిన అగ్ర నటులు మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Updated Date - May 21 , 2024 | 04:51 PM