Manchu Mohan Babu: పాపం, ఘోరాతి ఘోరం, అతినీచం
ABN, Publish Date - Sep 21 , 2024 | 06:01 PM
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడి లడ్డూ (Tirumlaa Laddu) ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన వివాదంపై మంచు మోహన్‌బాబు స్పందించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడి లడ్డూ (Tirumlaa Laddu) ప్రసాదంలో కల్తీ నెయ్యి (ghee)వాడిన వివాదంపై మంచు మోహన్‌బాబు (Mohan Babu) స్పందించారు. దీనిపై ట్విట్టర్ వేదిక ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే తల్లడిల్లిపోయానని, తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యానని అన్నారు.
"ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలో ఉపయోగించే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా (Tirumala Laddu Controversy) తల్లడిల్లిపోయాను. నిత్యం మా విశ్వవిద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. ఇదేగాని నిజమైతే బాధ్యులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానను’’ అని ట్విట్టర్‌లో ఓ లేఖ పోస్ట్ చేశారు.