Mohan Babu: మోహన్ బాబు హెల్త్ బులిటెన్
ABN, Publish Date - Dec 11 , 2024 | 11:58 AM
మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు.
మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. మంచు మోహన్‌బాబు కుటుంబంలో గత మూడు రోజులుగా ఇంటి గొడవలు ఎలా రచ్చకెక్కాయో తెలిసిందే. ఆ గొడవలు ఇప్పుడు మరింత ముదిరి తారాస్థాయికి చేరాయి. మంగళవారం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో కూడా తెలిసిందే. అయితే మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు గాయం కావడంతో ఆయనని మంచు విష్ణు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.
మోహన్ బాబు ఫస్ట్ హెల్త్ బులిటెన్ ఇదే..
మోహన్ బాబు ఆరోగ్యం పై బులిటెన్ విడుదల చేశారు కాంటినెంటర్ హాస్పిటల్ ఛైర్మన్. మోహన్ బాబు హాస్పిటల్‌కి వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. బీపీ పెరిగింది. అతనికి ప్రస్తుతం మెడలో నొప్పి విపరీతంగా ఉంది. మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. ఎక్కువ యాంగ్జైటీగా ఉన్నారు. ఫేస్ మీద కొన్ని గాయాలు ఉన్నాయి. బీపీ 200 పైన ఉంది.. ఇవ్వాళ కూడా ఇంకా బీపీ ఉంది. హార్ట్ సైడ్ అంతా బాగానే ఉంది. రాత్రంతా బాధ వల్ల నిద్ర లేదు. గతంలో జరిగిన కొన్ని సర్జరీలతో ఆయన వేరే మెడిసిన్ వాడుతున్నారని కాంటినెంటల్ హాస్పిటల్ ఛైర్మెన్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్యం అన్‌స్టెబుల్‌గానే ఉంది. ఇంటర్నల్ గాయాలు ఉన్నాయి. సీటీ స్కాన్ తీశాము. డిశ్చార్జ్‌కి ఇంకా రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. ఆయన మానసికంగా కోలుకోవడానికి సమయం పడుతుంది.. అని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.