Manadesam@ 75: సీనియర్‌ ఎన్టీఆర్‌ 'మనదేశం' 75 ఏళ్ల వేడుక

ABN, Publish Date - Dec 06 , 2024 | 02:16 PM

సీనియర్‌ ఎన్టీఆర్‌ (Sr Ntr) నటించిన తొలి చిత్రం ‘మన దేశం’ (Manadesam). ఈ సినిమా విడుదలై 75 ఏళ్లు (75 Years Celebrations) పూర్తయిన విషయం తెలిసిందే.


సీనియర్‌ ఎన్టీఆర్‌ (Sr Ntr) నటించిన తొలి చిత్రం ‘మన దేశం’ (Manadesam). ఈ సినిమా విడుదలై 75 ఏళ్లు (75 Years Celebrations) పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలో వేడుకను నిర్వహించాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (TFI) నిర్ణయించింది. డిసెంబర్‌ 14న విజయవాడలో ఈ వేడుక జరగనుంది. దీని ఏర్పాట్ల కోసం బుధవారం ఛాంబర్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు నిర్మాతల మండలి, తెలంగాణ ేస్టట్‌ చిత్ర వాణిజ్యమండలి, తెలుగు ఫిల్మ్‌ ఇండస్ర్టీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, తెలుగు సినీ రైటర్స్‌ అసోసియేషన్‌, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధులు పాల్గొని వేడుక గురించి చర్చించారు.  

Updated Date - Dec 06 , 2024 | 02:16 PM