Manjummel Boys: మలయాళ.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'మంజుమ్మల్ బాయ్స్' ట్రైలర్ వచ్చేసింది
ABN, Publish Date - Mar 31 , 2024 | 09:13 PM
మలయాళ సినిమా చరిత్రలో ఫస్ట్ టైం రూ. 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు ట్రైలర్ విడుదలైంది.
నెల రోజుల క్రితం మలయాళం విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 'మంజుమ్మల్ బాయ్స్' (Manjummel Boys). సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో నటించగా చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ 'మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) కేవలం మలయాళంలోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతేగాక ఇంతవరకు మరే మలయాళ చిత్రం సాధించలేని రూ. 200కోట్ల వసూళ్ల మార్కును దాటి అల్‌టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
పరవ ఫిలింస్ పతాకంపై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రాన్ని ఇటీవలే తమిళంలోనూ విడుదల చేయగా అక్కడా మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తోంది. తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తుండగా.. ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
'మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) కథ నేపథ్యానికి వస్తే.. బాల్యం నుంచి సరదాసరదాగా గడుపుతున్న కలిసి పెరిగిన ఓ యంగ్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఓ రోజు తమకు ఎప్పటి నుంచో కలగా ఉన్న తమిళనాడులోని కొడైకెనాల్‌కు టూర్ కి వెళ్తారు. అక్కడ హిల్ స్టేషన్ తో పాటు కమల్ హాసన్ 'గుణ' చిత్రీకరించబడిన డెవిల్స్ కిచెన్ అని పిలువబడే గుణ కేవ్స్ ను ఎక్స్ ఫ్లోర్ చేయడానికి వెళ్తారు.
ఈ క్రమంలో దురదృష్టవశాత్తు స్నేహితుల్లో ఒకరు గుహలోని లోతైన గుంతలో పడిపోతాడు, మిగతా వారు భయాందోళనలకు గురౌతారు. ఈక్రమంలో అతన్ని రక్షించేందుకు పొలీసులు రెస్క్యూ మిషన్ ప్రారంభించిన సఫలమవుదు. ఈ క్రమంలో వారు ఎలాంటి నఇర్‌నయం తీసుకున్నారు.. తమ మిత్రున్ని రక్షించారా ఇలా ఆసక్తికరమైన కథకథనాలతో నిజ జీవిత ఘటనల ఆధారంగా 'మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) సినిమాను సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా చూసే వారిక గూస్‌బంప్స్ వచ్చేలా సినిమాను రూపొందించారు.
పర్ఫెక్ట్ కాస్టింగ్ ఈ కథనానికి ఒరిజినాలిటీని తీసుకురాగా.. ప్రొడక్షన్ డిజైన్, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి, షైజు ఖలీద్ కొడైకెనాల్ ల్యాండ్‌స్కేప్‌లను అద్భుతంగా తీశారు. సుశిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ మూడ్‌లను సెట్ చేస్తుంది. తాజాగా రిలీజ్ ,ఏసిన ట్రైలర్ చాలా ప్రామెసింగ్ గా ఉంటూ సినిమాపై అంచనాలు పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు వెర్షన్‌కు విడుదల చేస్తుండడంతో డబ్బింగ్‌లో క్వాలిటీ మిస్సవకుండా మనకు 'మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) స్ట్రెయిట్ సినిమా చూస్తున్న అనుభూతిని ఇచ్చేలా తీర్చిదిద్దారు.