40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలో వేదిక

ABN, Publish Date - Jan 17 , 2024 | 03:16 PM

మలయాళం నటి వేదిక తెలుగు సినిమా 'ఫియర్' లో నటిస్తోంది. ఆమె ఇంతకు ముందు ఇలాంటి సస్పెన్స్, థ్రిల్లర్ నేపధ్యం వున్న సినిమా చెయ్యలేదని, ఇది మొదటిసారని చెప్పింది. హరిత ఈ సినిమాకి దర్శకురాలు.

Vedhika's new film 'Fear' launched on Wednesday in Hyderabad

కథానాయిక వేదిక ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఫియర్' చిత్రం ఇవాళ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ స్టూడియోలో లాంఛ్ అయ్యింది. ఈ సినిమాకి హరిత గోగినేని దర్శకత్వం చేస్తుండగా, దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఉంటుందని దర్శకురాలు హరిత గోగినేని చెపుతున్నారు. ఇందులో అరవింద్ కృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సీనియర్ నటుడు మురళీ మోహన్, దర్శకుడు కరుణాకరన్ ముఖ్య అతిధులుగా వచ్చి టీముకి తమ అభినందనాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తేజ కాకుమాను, బిగ్ బాస్ ఫెమ్ సోహైల్ అతిథులుగా పాల్గొన్నారు.

కథానాయకురాలు అయిన వేదిక ఈ సినిమా షూటింగ్ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. ఎందుకంటే ఇలాంటి ఒక సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం చెయ్యడం తనకి ఇదే మొదటిసారి అని చెప్పింది. ఆమె పాత్రలో ఎన్నో వైవిధ్యాలు వుంటాయని, అలాగే తన నటనని కనపరిచే చిత్రం ఇది అవుతుందని చెప్పింది వేదిక. ఇంతకు ముందు నేను తెలుగులో 'కాంచన', 'రూలర్' సినిమాల్లో నటించాను, అలాగే ఓ వెబ్ సిరీస్ చేశాను కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కథలో నటించలేదు. ఇప్పుడు దర్శకురాలు హరిత గోగినేని ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ రెడీ చేసి ఈ కథ నాకు చెప్పినప్పుడు నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. "స్టోరీ, క్యారెక్టర్స్ డిజైన్ లో హరిత చాలా క్లారిటీగా ఉన్నారు. కొత్త డైరెక్టర్ అని నాకు అనిపించలేదు. అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ తో ఈ 'ఫియర్' సినిమా చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం", అని చెప్పింది వేదిక. (Vedhika's new film titled 'Fear' launched on Wednesday)

"దర్శకత్వం చేయడం అనేది నా డ్రీమ్ కాదు డెస్టినీ అనుకుంటాను. ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుంది అని ఆలోచిస్తూ ఏడాదిపాటు ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ స్క్రిప్టుకు వేదిక లాంటి మంచి కథానాయకురాలు దొరకడం సంతోషంగా ఉంది. అలాగే మంచి టీమ్ కూడా నాకు దొరికింది. వీరి సహాయంతో నేను అనుకున్న స్క్రిప్ట్ తో అనుకున్న టైమ్ లో సినిమా పూర్తి చేసి ప్రేక్షకులకు నచ్చేలా స్క్రీన్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాను," అని దర్శకురాలు హరిత చెప్పింది.

నిర్మాత ఏఆర్ అభి మాట్లాడుతూ దర్శకురాలు హరిత తన వైఫ్ అని చెప్పారు. "మా సంస్థలో లక్కీ లక్ష్మణ్ సినిమాకు వర్క్ చేసింది. అప్పుడు ప్రతి పని డెడికేటెడ్ గా చేసింది, అందుకని ఆమె దర్శకత్వం కూడా చాలా బాగా చేయగలదు అని నమ్మకం ఉంది. ఈ సినిమా 'ఫియర్' కథని చాలా బాగా రాసుకుంది, ఈ సినిమా నేను చేస్తాను అని ముందుకు వచ్చి హరితకు సపోర్ట్ చేస్తున్న వేదిక గారికి ధన్యవాదాలు. ఆమె పాత్ర ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది," అని చెప్పారు నిర్మాత.

Updated Date - Jan 17 , 2024 | 03:16 PM