Pushpa 2 The Rule: ‘పుష్ప 2’.. ‘దేవర’లా కాదు కదా..
ABN, Publish Date - Dec 01 , 2024 | 11:18 AM
హైదరాబాద్‌లో జరగనున్న ‘పుష్ప 2 ది రూల్’ ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి మేకర్స్ సెంటిమెంట్‌కే తావిచ్చారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుత క్రేజ్ దృష్ట్యా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అలా చేయలేదంటే.. మరో ‘పుష్ప 2’ మరో ‘దేవర’ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
‘పుష్ప 2: ది రూల్’ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం పీక్‌లో ఉన్న విషయం తెలిసిందే. పాట్నా, చెన్నయ్, కొచ్చి, ముంబై ఇలా వరసగా గ్యాప్ లేకుండా టీమ్ ప్రమోషన్స్‌ని నిర్వహిస్తోంది. అయితే ఎన్ని చోట్ల ఈవెంట్స్ జరిగినా హైదరాబాద్ మాత్రం ‘పుష్ప’గాడికి అడ్డా అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి డిటైల్స్ వచ్చేశాయి. అయితే ముందుగా సోషల్ మీడియాలో హైదరాబాద్‌లో జరిగే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి అనేక రకాలుగా వార్తలు వైరల్ అవుతుండగా.. మేకర్స్ వాటన్నింటికీ చెక్ పెట్టి.. సెంటిమెంట్‌కే చోటిచ్చారు. ఏంటా వార్తలు? ఏంటా సెంటిమెంట్? అని అనుకుంటున్నారా? విషయంలోకి వస్తే..
Also Read- Raashii Khanna: పుట్టినరోజున రాశీఖన్నా ఏం చేసిందంటే..
మొదటగా హైదరాబాద్‌లో ‘పుష్ప 2 ది రూల్’ ప్రీ రిలీజ్ వేడుకను మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించబోతున్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే యాంటీ ఫ్యాన్స్ రకరకాల వార్తలను వైరల్ చేశారు. కానీ మేకర్స్ సెంటిమెంట్‌కు తావిస్తూ.. ‘పుష్ప ది రైజ్’ ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడైతే జరిగిందో.. అదే చోట ఈ పార్ట్ 2 ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ వేడుక జరగబోతోంది. ‘పుష్ప 1’ కూడా ఇదే గ్రౌండ్స్‌లో నిర్వహించగా.. అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇప్పుడు డబుల్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. మేకర్స్ దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
ఎందుకంటే, ఇటీవల ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక విషయంలోనూ ఇలాగే జరిగింది. ఎవరూ ఊహించని విధంగా అభిమానులు తరలి రావడంతో చివరి నిమిషంలో ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటే యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ ఈ వేడుకకు ఏ మాత్రం సరిపోదనేలా అప్పుడే టాక్ వినబడుతోంది. కాబట్టి ‘దేవర’లా కాకుండా ఉండాలంటే.. ‘పుష్ప 2’ మేకర్స్ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మేకర్స్ ఏం ప్రయత్నాలు చేస్తారో చూడాల్సి ఉంది. కాగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు.