Sitara Ghattamaneni: అంబాని పెళ్లిలో సితార సందడి.. ఎవరినీ వదల్లేదుగా!
ABN, Publish Date - Jul 15 , 2024 | 04:05 PM
ముంబయ్‌లో అంబాని వారసుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడుకలో మన సూపర్ స్టార్ మహేశ్‌బాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి అక్కడికి వచ్చిన వారిన మెస్మరైజ్ చేశారు.
ముంబయ్‌లో జరిగిన ముఖేష్ అంబాని వారసుడు అనంత్ అంబాని, రాధిక మర్చంట్ ల వివాహ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలతో పాగు, క్రీడాకారులు, పాప్ సింగర్లు, హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ ఇండియా సినీ స్టార్లు తరలి వచ్చారు.
అయితే ఈ వేడుకలో మన సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) చాలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి పెళ్లి వేడుకలకు వచ్చిన వారిన మెస్మరైజ్ చేశారు. హాలీవుడ్ స్టార్లను తలదన్నే తన అందంతో , ఆహార్యంతో అందరి కన్నా మిన్నగా వార్తల్లో నిలిచారు.
ఇక మహేశ్ బాబు కూతురు సితార (Sitara Ghattamaneni) అయితే అక్కడికి వచ్చిన వారందరితో సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేసింది.
ముఖ్యంగా బాలీవుడ్ కథానాయికలు ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), కియారా అద్వాని (Kiara Advani), రేఖ, ఐశ్వర్యారాయ్ హాలీవుడ్ పాప్ సింగర్ కిమ్ కర్దాషియాన్ (Kim Kardashian)
బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్ (Ranveer Singh), సిద్ధార్థ్ మల్హోత్రా వంటి వారిని వదలకుండా ఫొటోలు దిగుతూ వారిపై తన అభిమానాన్ని చాటుకుంది.
ఇప్పుడు ఈ పోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.