మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahesh Babu: మహేష్‌బాబు లుక్‌  మామూలుగా లేదుగా..!

ABN, Publish Date - Apr 02 , 2024 | 12:48 PM

'గుంటూరు కారం’(Guntur kaaram) చిత్రంతో అలరించిన సూపర్‌స్టార్‌  మహేష్ బాబు (mahesh babu)ప్రస్తుతం రాజమౌళితో SSMB29 సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.


'గుంటూరు కారం’(Guntur kaaram) చిత్రంతో అలరించిన సూపర్‌స్టార్‌  మహేష్ బాబు (mahesh babu)ప్రస్తుతం రాజమౌళితో SSMB29 సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే మహేష్‌పై ఫొటో షూట్‌ కూడా జరిగింది. త్వరలో షూటింగ్‌ మొదలవుతుందని ఇటీవల మహేశ్  ఓ వేదికపై వెల్లడించారు. చిత్రీకరణ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.



తాజాగా మహేష్‌ లేటెస్ట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.. ట్రెండీ లుక్‌లో మహేష్  ఆకట్టుకుంటున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్‌ వర్కౌట్స్‌ చేస్తున్నారు. అలాగే రాజమౌళి స్ర్కిప్ట్‌ ఫైనల్‌ చేయడంతోపాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారు. ఆర్టిస్టులను ఫైనల్‌ చేేసే  పనిలో ఉన్నారు.. ఇక రెండు మూడు నెలల్లో షూటింగ్‌ పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి.  



పాన్ ఇండియా  చిత్రంలా కాకుండా పాన్ వరల్డ్‌ స్థాయిలో రాజమౌళి ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం   మహేష్‌ బాబు తొమ్మిది రకాల గెటప్స్‌ ట్రై చేశారట. అడ్వంచర్‌ కథతో రాబోతున్న ఈ సినిమా కోసం ఒక లుక్‌ను ఫైనల్‌ చేశారట.

అయితే నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో సినిమా ఓపెనింగ్‌ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. దాదాపు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

Updated Date - Apr 02 , 2024 | 12:48 PM