Mahesh Wedding Day: జీవితం.. ప్రేమతో నిండిపోయింది!
ABN, Publish Date - Feb 10 , 2024 | 04:16 PM
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేష్(MaheshBabu)-నమ్రత (Namratha) ముందు వరుసలో ఉంటారు. వెండితెరపై హీరోహీరోయిన్లగా అలరించి నిజ జీవితంలో వివాహబంధంతో ఒకటైన జంటల్లో వీరు కూడా ఉన్నారు.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేష్(MaheshBabu)-నమ్రత (Namratha) ముందు వరుసలో ఉంటారు. వెండితెరపై హీరోహీరోయిన్లగా అలరించి నిజ జీవితంలో వివాహబంధంతో ఒకటైన జంటల్లో వీరు కూడా ఉన్నారు. ‘వంశీ’ చిత్రంతో జోడి కట్టిన ఈ ఇద్దరూ నిజ జీవితంలోను జంటగా ఉన్నారు. వంశీ చిత్రం షూటింగ్ న్యూజీలాండ్‌లో జరుగుతున్నప్పుడు వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. అయితే ఈ విషయం దాదాపు నాలుగేళ్ల వరకూ బయటపడకుండా మహేష్ జాగ్రత్త పడ్డారు. నాలుగేళ్లు ప్రేమలో మునిగి తేలిన తర్వాత ఇద్దరి మధ్య ప్రేమాయణం గురించి ఇంట్లో చెప్పారు. మహేష్ సోదరి మంజుల కుటుంబ సభ్యులను ఈ పెళ్లికి ఒప్పించిందట. ఇరు కుటుంబాల సమక్షంలో 2005 ఫిబ్రవరి 10న మహేష్- నమ్రత వివాహబంధంతో ఒకటయ్యారు. (Wedding anniversary)
ఇప్పుడు వీరి వైవాహిక జీవితానికి 18 ఏళ్లు. శనివారం (ఫిబ్రవరి 10) మహేష్-నమ్రతల పెళ్లి రోజు. ఈ సందర్భంగా మహేష్, నమ్రతకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "జీవితం ప్రేమ, నవ్వులు, ఆనంద క్షణాలతో బ్యూటిఫుల్‌గా ఉంది. పెళ్లి రోజు శుభాకాంక్షలు నమ్రతా" అని ఆమెకు ముద్దు పెడుతున్న ఫొటో ఒకటి మహేష్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్‌గా మారింది . మహేష్ పోస్ట్‌కు చాలామంది సెలబ్రిటీలు కామెంట్స్ పెడుతున్నారు. 'నీ మీద ప్రేమ అనేది ఈరోజు మాత్రమే కాదు ఎప్పటికీ ఉంటుంది’’ అని నమ్రత శిరోద్కర్ కామెంట్స్ చేశారు. ఇటీవల గుంటూరు కారం చిత్రంతో అలరించిన మహేష్, త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ 29 షురూ చేయనున్నారు.