మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahesh Babu: మహేశ్ ఆ సినిమాను వందసార్లు చూశారట!

ABN, Publish Date - Jun 12 , 2024 | 02:37 PM

తేజ (Teja) దర్శకత్వంలో నేను  నటించిన 'నిజం’ నాకెంతో నచ్చిన సినిమా. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్‌ చెప్పాలి. ‘నిజం’ చేసినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను’’ అని మహేష్ బాబు (Mahesh Babu) అన్నారు.

Harom Hara Movie Event

తేజ (Teja) దర్శకత్వంలో నేను  నటించిన 'నిజం’ నాకెంతో నచ్చిన సినిమా. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్‌ చెప్పాలి. ‘నిజం’ చేసినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను’’ అని మహేష్ బాబు (Mahesh Babu) అన్నారు. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’ (haromHara). జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అడివి శేష్‌, విశ్వక్‌సేన్  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో మహేశ్‌ బాబుతో మాట్లాడిన ఫోన్‌ రికార్డును సుధీర్‌బాబు ప్లే చేశారు. అందులో సుధీర్‌ అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ సమాధానమిచ్చారు.



సుధీర్‌బాబు: మీ సినిమాల్లో మొదటిసారి గన్స్‌ ఉపయోగించినప్పుడు ఎలా అనిపించింది?
మహేశ్‌: గన్స్‌ ఉపయోగించడంపై నేను ప్రత్యేక శిక్షణేం తీసుకోలేదు. ‘టక్కరి దొంగ’లో ఎక్కువగా గన్స్‌ వాడాం. ఆ సినిమా నాకు ఎంతో స్పెషల్.  

సుధీర్‌బాబు: గన్స్‌ను చూపించిన సినిమాల్లో నీకు నచ్చింది ఏది?

మహేశ్‌ నాన్న నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’. ఆ సినిమాను వందసార్లు చూసుంటాను. నాకు చాలా ఇష్టమైన చిత్రం అది.



‘హరోంహర’లో బాగా నచ్చిన పాట?

మహేశ్‌ బాబు: టైటిల్‌ సాంగ్‌ చాలా నచ్చింది. అది వినగానే నేను నీకు మెేసజ్‌ కూడా చేశాను.

‘హరోంహర’ ట్రైలర్‌లో నీకు నచ్చిందేంటి?
మహేశ్‌ బాబు: నువ్వు చాలా కొత్తగా ఉన్నావ్‌. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదనిపించింది అని మహేశ్  సరదాగా చెప్పుకొచ్చారు.


ఇక సుదీర్‌బాబు మాట్లాడుతూ  ‘అడివి శేష్‌ నాకు స్ఫూర్తి. తన తలరాతను తానే రాసుకున్నాడు. సినిమా కథల విషయంలో చాలా మంది అభిప్రాయాలు తీసుకుని మార్పులు చేసుకుంటారు. ఈ రోజుల్లో ఒక హీరోకు మరో హీరో సపోర్ట్‌ చేసుకోవాలి. ఏ సినిమా ప్రీరిలీజ్‌ అయినా విశ్వక్‌సేన్  హాజరవుతారు. అది తనలో ఉన్న గొప్ప లక్షణం. ‘హరోంహర’లో నేను సుబ్రహ్మణ్యం పాత్రలో కనిపిస్తాను. ఇది మంచి విజయం సాధిస్తుంది. దీని కోసం చాలా మంది కష్టపడ్డారు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు.

నన్ను ఇలాంటి పాత్రలో చూడాలని మా మావయ్య కృష్ణ గారు కోరుకున్నారు. ఆయన ఉంటే ఆనందించేవారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్యంలా ఫీలవుతారు. ముఖ్యంగా హీరో మహేశ్‌ బాబుకు థ్యాంక్స్‌ చెప్పాలి. ట్రైలర్‌ చూశాక చాలా సపోర్ట్‌ చేశారు. ఆయనతో సినిమా తీయాలంటే రెండేళ్లు పడుతుంది. ఈ గ్యాప్‌లో నేను మీ ముందుకు వచ్చి అలరిస్తాను. ఆయన ఇచ్చినంత కిక్‌ ఇవ్వకపోవచ్చు గానీ.. కచ్చితంగా మీ అందరికీ వినోదాన్ని పంచుతాను’ అని అన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 04:19 PM