Mahesh Babu: ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి సూపర్ స్టార్ భారీ విరాళం

ABN, Publish Date - Sep 03 , 2024 | 09:02 PM

ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా ముందుగా స్పందించేది టాలీవుడ్ పరిశ్రమే. ఈసారి కూడా సెలబ్రిటీలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన విపత్తు నుండి బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు భారీ విరాళాన్ని ప్రకటించారు.

Super Star Mahesh Babu

ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా ముందుగా స్పందించేది టాలీవుడ్ పరిశ్రమే. ఈసారి కూడా సెలబ్రిటీలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన విపత్తు నుండి బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలెందరో ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. ప్రకటిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu).. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు.

Also Read- Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళం


‘‘రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేస్తున్న దృష్ట్యా.. నేను ఏపీ మరియు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల చొప్పున ఒక్కొక్కరికి విరాళం ఇస్తున్నాను. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి మరియు పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడానికి సంబంధిత ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను కోరుతున్నాను. మనం ఈ సంక్షోభాన్ని అధిగమించి, మరింత బలంగా ఎదగాలి..’’ అని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం మహేష్ ట్వీట్ వైరల్ అవుతోంది. అభిమానులు, ప్రేక్షకులు మహేష్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇప్పటి వరకు సహాయం ప్రకటించిన సెలబ్రిటీలు వీరే..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్- ఏపీకి రూ. కోటి

నందమూరి బాలకృష్ణ- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు

సూపర్ స్టార్ మహేష్ బాబు- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు

వైజయంతీ మూవీస్- ఏపీకి రూ. 25 లక్షలు

త్రివిక్రమ్ - రాధాకృష్ణ - నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు

ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి

విశ్వక్సేన్- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు

సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు

వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు

అనన్య నాగళ్ల- ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు

Read Latest Cinema News

Updated Date - Sep 03 , 2024 | 09:02 PM