మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahesh Babu, Ram Charan: ఓటు వేసిన మ‌హేశ్‌బాబు, రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు

ABN, Publish Date - May 13 , 2024 | 05:07 PM

ఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్టాల‌లో పోలింగ్ ప్ర‌శాంతంగా సాగుతోంది. సాధార‌ణ పౌరుల‌తో పాటు సినీ తారాలోకం దిగి వ‌చ్చి ఉత్సాహంగా త‌మ ఓటును వినియోగించుకుని అద‌ర్శంగా నిలిచారు.

ఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్టాల‌లో పోలింగ్ ప్ర‌శాంతంగా సాగుతోంది. దాదాపు అన్ని చోట్లా మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 40 శాతం పోలింగ్‌ పూర్తి చేసుకుంది. ఆంధ్ర ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దంప‌తులు మంగ‌ళ‌గిరిలో, బాల‌కృష్ణ దంప‌తులు హిందూపూర్‌లో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం రాయ‌చోటిలో, ద‌ర్శ‌కులు గోపీచంద్, బుచ్చిబాబు, వైవీఎస్ చౌద‌రి, గెట‌ప్ శీను వంటి ప్ర‌ముఖులు త‌మ సొంత గ్రామాల్లో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.


ఇక తెలంగాణ‌లో లోక్‌సభ (TS elections 2024) పోలింగ్ నేప‌థ్యంలో ఉద‌యం నుంచే సినీ స్టార్లు ఓట్లు వేసేందుకు లైన్లు క‌ట్టారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో మొద‌లు, అల్లు అర్జున్‌, రామ్‌, నితిన్‌, నాని, చిరంజీవి (Chiranjeevi ), వెంక‌టేశ్‌, నాగచైత‌న్య‌, నాగార్జున త‌దిత‌ర తారాలోకం అంతా వ‌చ్చి లైన్‌లో నిల‌బ‌డి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఆపై సాయంత్రం సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు (Mahesh Babu) ఆయ‌న భార్య న‌మ్ర‌త (Namratha), గ్టోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan), ఉపాస‌న (Upasana)లు జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌ల‌లో త‌మ ఓటు హ‌క్కును వినియెగించుకున్నారు.

Updated Date - May 13 , 2024 | 05:17 PM