మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijay Sethupathi: బాలకృష్ణ గారిని ఆ రోజు కౌగిలించుకున్నా

ABN, Publish Date - Jun 10 , 2024 | 06:25 PM

త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి తాజాగా న‌టించిన చిత్రం మ‌హ‌రాజా. థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అయింది. ఈ క్ర‌మంలో ఈ రోజు(సోమ‌వారం) నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో ఆయ‌న పాల్గొని సినిమా విష‌యాల‌తో పాటు బాల‌కృష్ణ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

vijay sethupthi

తెలుగు ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి. షార్ట్ ఫిలీంస్‌తో మొద‌లు పెట్టి అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదిగిన ఆయ‌న తెలుగులో ఉప్పెన సినిమాతో ద‌గ్గ‌ర‌య్యారు. ఇక్క‌డా త‌న‌కంటూ స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఆయ‌న న‌టించిన మ‌హ‌రాజీ అనే చిత్రం త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అయింది. ఈ క్ర‌మంలో ఈ రోజు(సోమ‌వారం) హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో ఆయ‌న పాల్గొని సినిమా విష‌యాల‌తో పాటు బాల‌కృష్ణ (Balakrishna) గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

చిరంజీవి సినిమాలో న‌టించారు మ‌రి బాలకృష్ణ (Balakrishna) చిత్రంలో ఎప్పుడు న‌టిస్తార‌ని ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు విజ‌య్ సేతుప‌తి స‌మాధాన‌మిస్తూ.. నేను బాల‌కృష్ణ గారికి చాలా పెద్ద అభిమానిని అని ముందుగా ఆయ‌న‌కు హ్య‌పీ బ‌ర్త్ డే అని అన్నారు. బాల‌కృష్ణ గారివి చాలా ట్రోల్స్‌ చూశాను కానీ ఆయ‌న నాకు చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న న‌ట‌న‌ ఇంప్రెసివ్ చేసింద‌న్నారు. ముఖ్యంగా షూటింగ్‌లో ఆయ‌న కెమెరాను హ్యాండిల్ చేసే ప‌ద్ద‌తి బాగుంటుంద‌న్నారు. గ‌తంలో చెన్నైలో జ‌రిగిన 100 ఏళ్ల త‌మిళ సినిమా సంబురాల స‌మ‌యంలో నేను బాల‌కృష్ణ (Balakrishna) గారిని క‌లిశాన‌ని, ఒక‌సారి కౌగిలించుకున్నాన‌ని అన్నారు. అ విష‌యం అయ‌న‌కు గుర్తుందో లేనిది తెలియ‌దన్నారు.


ఇక‌.. రామోజీరావు గారి మ‌ర‌ణం సినిమా ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోట‌ని నాకు హైద‌రాబాద్‌లో ఎక్కువ‌గా రామోజీ ఫిలింసిటీతో అనుబంధం ఉన్న‌ద‌ని విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi) అన్నారు. 2005లో తొలిసారి నేను రామోజీ ఫిలింసిటీకి వచ్చానని.. ధనుష్ పుదుపెట్టై సినిమా ఎక్కువగా అక్కడే చిత్రీకరణ జరిగిందన్నారు. సినిమా కోసం‌ అవసరమైన అన్నీ లోకెషన్స్ అక్కడ క్రియేట్ చేశారని, సినిమా వారి కోసం రామోజీరావు గారు అన్నీ సౌకర్యాలు కల్పించారని అలాంటి గొప్ప విజన్ ఉన్న వ్యక్తి కన్నుమూయటం బాధాకరమ‌ని అన్నారు.

యాక్టర్, స్టార్ ట్యాగ్ మధ్య ఎలాంటి తేడా ఉండదని ఎవరికైనా‌ ఒకటే కష్టం ఉంటుందని అన్నారు. నిమాపై బుచ్చిబాబు ప్యాషన్ నచ్చి ఆయ‌న కోసమే ఉప్పెన సినిమాలో నటించానని.. తెలుగు సినిమాల్లో నటించటం కోసం‌ ఎక్కువగా వెయిట్ చేస్తున్నాన‌ని అన్నారు.

Read more!
Updated Date - Jun 10 , 2024 | 06:41 PM