MAA: ‘మా’ ఆధ్వర్యంలో నాలుగోసారి ఫ్రీ హెల్త్ క్యాంప్.. మంచు విష్ణు ఏమన్నారంటే
ABN, Publish Date - Sep 29 , 2024 | 06:22 PM
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను ఆదివారం నిర్వహించారు. ‘మా’ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌ను జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంపై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఏమన్నారంటే..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artists Association) సభ్యులందరికీ కూడా ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను ఆదివారం నిర్వహించారు. ‘మా’ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణు మంచు (Maa President Vishnu Manchu), వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌ను జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ హెల్త్ చెకప్‌లో ‘మా’ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో విష్ణు మంచు మాట్లాడుతూ.. డా.శాస్త్రి గారికి, జీవీకే హెల్త్ హబ్‌కు థాంక్స్. ‘మా’ సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి హెల్త్ క్యాంప్ ప్రారంభమైంది. వేల ఖర్చుతో కూడుకున్న ఈ హెల్త్ చెకప్‌ను ఫ్రీగా అందిస్తున్నందుకు థాంక్స్. ఇది ఇకపై ఇలా కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Tollywood: ఈ సమ్మర్‌కి మరింత వేడి!
వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ.. జీవీకే హెల్త్ హబ్‌తో కలిసి మాస్టర్ హెల్త్ చెకప్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు మా సభ్యుల ఆరోగ్యానికి ఎప్పడూ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇది మా ఆధ్వర్యంలో నాలుగో హెల్త్ క్యాంప్. మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం కోసం హెల్త్ కార్డ్‌లను జారీ చేశాం. వాటిని అందరూ వినియోగించుకోవాలి. దేశంలో అత్యవసర సేవల విషయంలో జీవీకే సంస్థ చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే. మా సభ్యుల కోసం ఇలా హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేసేందుకు సాయం చేసిన జీవీకే రెడ్డి గారికి థాంక్స్’ అని తెలపగా.. శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘మా’ ఆధ్వర్యంలో ఇది నాలుగో ఫ్రీ హెల్త్ క్యాంప్. జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఇది చాలా సక్సెస్ ఫుల్‌గా జరిగింది. సహకరించిన అందరికీ థాంక్స్ అని అన్నారు.
డా.శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు వరల్డ్ హార్ట్ డే (World Heart Day). హార్ట్ ఎటాక్‌లు రాకుండా నిరోధించాలి. డైట్, హెల్త్ పట్ల అందరూ అవగాహనతో ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆర్టిస్టులకి ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. అందుకే వీరి కోసం స్పెషల్‌గా మాస్టర్ చెకప్ చేస్తున్నాం. తగినంత నిద్ర, స్పిరిట్యువల్ హెల్త్ కూడా చూసుకోవాలని తెలిపారు.
ఇదే కార్యక్రమంలో ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నటీనటులంతా అద్దాల మేడల్లో ఉంటాం. ఏదైనా విషయంపై నేను మాట్లాడితే కొంతమందికి నచ్చవచ్చు.. కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చనివాళ్లు టార్గెట్ చేసి మాట్లాడతారు. అందుకే నటీనటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బ తింటాయేమోనని భయంగా ఉంది. ప్రకాష్ రాజ్ దేవుడిని నమ్ముతాడో లేదో నాకు తెలీదు. కానీ ఈ విషయంలో అతని చేత శివయ్య అని పలికించాను. జై శ్రీరామ్ అని కూడా చెప్పిస్తాను’’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.