Wedding Diaries: ‘బిగ్ బాస్ అర్జున్ అంబటి’.. వెడ్డింగ్ డైరీస్ ట్రైలర్ వచ్చేసింది

ABN, Publish Date - Aug 21 , 2024 | 01:49 PM

బిగ్ బాస్ అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ జంటగా నటించిన కుటుంబ కథా చిత్రం వెడ్డింగ్ డైరీస్. ఆగస్టు 23న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఆస్కార్ విన్నర్, గీత రచయిత చంద్రబోస్ విడుదల చేశారు.

wedding

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి (Arjun Ambati), చాందిని తమిళరసన్ (Chandini Tamilarasan) జంటగా నటించిన కుటుంబ కథా చిత్రం వెడ్డింగ్ డైరీస్ (Wedding Diaries). ఎమ్ వి ఆర్ స్టూడియోస్ (MVR Studios) పతాకంపై డాక్టర్ మిద్దె విజయవాణి (Midde Vijayavani) సమర్పణలో వెంకటరమణ మిద్దె (Venkataramana Midde) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆగస్టు 23న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఆస్కార్ విన్నర్, గీత రచయిత చంద్రబోస్ (Chandra Bose) విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబోస్ (Chandra Bose) మాట్లాడుతూ "వెడ్డింగ్ డైరీస్ (Wedding Diaries) చిత్ర ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చే అపార్ధాలు అపోహలు వస్తూ పోతూ ఉంటాయి కానీ శాశ్వతం కాదు. శాశ్వతం గా ఉండేది వైవాహిక బంధం మాత్రమే అనే మంచి కథ తో ఈ వెడ్డింగ్ డైరీస్ చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. హీరో గా నటించిన అర్జున్ అంబటి టాలెంట్ ఉన్న నటుడు అలాగే హీరోయిన్ చాందిని తమిళరసన్, దర్శకుడు వెంకటరమణలకు నా శుభాకాంక్షలు. అలాగే సంగీత దర్శకుడు మదిన్ ఎస్ కె మంచి పాటలు స్వరపరిచారు. అందరు ఈ చిత్రానికి మంచి విజయం అందించాలి" అని కోరుకున్నారు.


హీరో అర్జున్ అంబటి (Arjun Ambati)మాట్లాడుతూ చంద్ర బోస్ గారు మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మా వెడ్డింగ్ డైరీస్ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. మంచి కుటుంబ కథ చిత్రం. ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన చిత్రం" అని తెలిపారు. దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ వివాహిత జీవితంలో రోజూ జరిగే గొడవలు, విభేదాలతో విసిగి విడిపోవాలని నిర్ణయించుకుంటారు. కానీ, తర్వాత ప్రేమను, తమ బంధం ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలుసుకోవడానికి ఏం చేశారనే నేపథ్యంలో ప్రేమ మరియు దీర్ఘకాలిక సంబంధాలపై విలువలను ీ సినిమా తెలుపుతుందన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 01:49 PM