మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Raju Yadav: 'థిస్ ఈజ్ మై దరిద్రం'.. 'రాజు యాదవ్‌' నుంచి సెకండ్ సింగిల్

ABN, Publish Date - Apr 28 , 2024 | 09:35 PM

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా వ‌స్తున్న చిత్రం 'రాజు యాదవ్'. తాజాగా ఈ చిత్రం నుంచి 'థిస్ ఈజ్ మై దరిద్రం' సాంగ్ ని హీరో సుడిగాలి సుదీర్ లాంచ్ చేశారు.

raju yadav

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను (GETUP SRINU) హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' (Raju Yadav) తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ఫస్ట్ సింగిల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'థిస్ ఈజ్ మై దరిద్రం' (This Is My Daridram) సాంగ్ ని హీరో సుడిగాలి సుదీర్ (Sudigali Sudheer) లాంచ్ చేశారు. యానిమ‌ల్ వంటి చిత్రానికి సమ్యూజిక్ అందించిన స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఎనర్జిటిక్ గా ట్యూన్ చేశారు. రాహుల్ సిప్లీగంజ్, మంగ్లీ హై వోకల్స్ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.


కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం హీరో క్యారెక్టర్ ని హిలేరియస్ గా ప్రజెంట్ చేసింది. ఈ పాటలో హీరోకి ఎదురయ్యే సిట్యువేషన్స్ నవ్వులు పంచాయి. ల‌వ్, కామెడీతో పాటు సినిమాలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉన్నాయి. కాగా ఈ రాజుయాదవ్ సినిమా మే 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Updated Date - Apr 28 , 2024 | 09:35 PM