Lucky Baskhar: మిడిల్ క్లాస్‌కి జీవితపాఠంగా.. 'లక్కీ భాస్కర్' డైలాగ్స్
ABN, Publish Date - Dec 16 , 2024 | 09:48 PM
మిడిల్ క్లాస్‌కి మోటివేషన్ ఇచ్చే 20 'లక్కీ భాస్కర్' మూవీ డైలాగ్స్.
దీపావళి కానుకగా రీలీజైన 'లక్కీ భాస్కర్' సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఒక నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న క్యారెక్టర్ గెలవాలి అని సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కోరుకోవడంలోనే ఈ సినిమా ప్రేక్షకులకి ఎంత కనెక్ట్ అయ్యిందో చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలోనే డైలాగ్స్ మూవీకే హైలెట్‌గా నిలిచాయి.
ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి కనెక్ట్ అవుతున్న 20 లక్కీ భాస్కర్ డైలాగ్స్ మీకోసం
మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్.. కష్టం వస్తే.. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం..
అదే పంతం వస్తే.. ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్..
దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం.
కలలు కనడానికి భయపడే వాళ్లకు కలల్ని నిజం చేసుకోవాలో చూపించాడు హర్షద్ మెహ్రా..
ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు. అందుకే పరుగెడుతూనే ఉంటారు.. కారణం డబ్బు..
బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా నేనే కావాలని నన్ను చేసుకుంది.. నా భార్య సుమతి..
థ్యాంక్యూ సార్.. నమ్మినందుకు.. థ్యాంక్యూ సార్ నిలబెట్టుకున్నందుకు..
కాలిగోటి దగ్గర నుంచి తల వరకు, ఏం కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించాను. అది కూడా తీసివ్వు. కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా..
దిస్ ఈజ్ ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి.. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఒంటిపై కనపడాలి..
ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు. ఆ మాత్రం దానికి రోజంతా బాధపడలా..
అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను..
నేను వెళ్లింది నగలు కొనడానికి మాత్రమే కాదు సార్.. వాడి అహంకారాన్ని కూడా కొనడానికి..
డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ..
ఇలాంటప్పుడే అనిపిస్తుంది.. ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా.. తప్పు లేదని..
సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ..
మాటల్లో ఇంత అహంకారం..
అహంకారం కాదు.. ధైర్యం..
చేతల్లో బలుపు..
బలుపు కాదు.. బలం
ఇంత చెడ్డవాడిలా మారిపోతావ్ అనుకోలేదు
ఐయామ్ నాట్ బ్యాడ్.. ఐయామ్ జస్ట్ రిచ్..!
జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు.. ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం..
వాడు కామన్ మ్యాన్..
అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకుని ప్రశాంతంగా పడుకోగలడు..
వెల్‌కమ్ టు బొంబాయి.. ది మనీ కేపిటల్ ఆఫ్ ఇండియా..
లక్కీ భాస్కర్’ ట్రైలర్ కథ, హీరో క్యారెక్టర్ ఏంటనేది చెప్పేసింది. ట్రైలర్‌తో సినిమాకు రెట్టింపు అంచనాలుపెరిగాయి. మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టి పడేసిన దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్’గా దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దర్శకుడు వెంకీ అట్లూరి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. చూసిన, చూడకపోయినా మళ్ళీ చూస్తే తప్పకుండ ఎంజాయ్ చేసే సినిమా ఇది.
కథ:
1990ల సమయం అది. భాస్కర్ కుమార్.. ముంబై మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. మఽధ్యతరగతి కుటుంబం, చాలిచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. వస్తుందనుకున్న ప్రమోషన్ చేజారడంతో రూపాయి పెడితే రెండు రూపాయలు వచ్చే మార్గాలను ఎంచుకుంటాడు. తదుపరి అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ప్రమోట్ అవుతాడు. మగధ బ్యాంక్‌లో ఆ జరిగిన స్కామ్ విచారణలో భాగంగా భాస్కర్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ చూసి అధికారులు షాక్ అవుతారు. నెలకు రూ. 19,500 జీతం తీసుకునే ఉద్యోగి అకౌంట్‌లో రూ.వంద కోట్లు వుంటాయి. అవి ఎలా వచ్చాయి. మగధ బ్యాంక్‌లో జరిగిన స్కామ్ ఏంటి? ఈ స్కామ్‌కి హర్ష్ మెహ్రాకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి స్కామ్ నుంచి భాస్కర్ గట్టెక్కాడా? అన్నది కథ.