Tollywood: సాయి ధరమ్, వరుణ్ తేజ్.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..
ABN, Publish Date - Sep 05 , 2024 | 03:28 PM
రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలతో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు కొందరు ఇప్పటికే తమవంతు సాయాన్ని అందించగా, బుధవారం స్టార్స్ అందరూ దాదాపు రూ. కోటి విరాళం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అత్యధికంగా రూ. 6 కోట్లు ప్రకటించి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పుడాయన దారిలోనే సాయితేజ్, వరుణ్ తేజ్ కూడా విరాళం ప్రకటించి.. ఒకరికొకరం అండగా ఉండాల్సిన సమయమిదని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలతో ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే తమవంతు సాయాన్ని అందించగా బుధవారం స్టార్స్ అందరూ దాదాపు రూ. కోటి విరాళం ప్రకటించారు. పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యధికంగా రూ. 6 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిరంజీవి, బాలయ్య, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున.. ఇలా టాలీవుడ్‌కి చెందిన స్టార్ అందరూ భారీ విరాళం ప్రకటించి.. కష్ట సమయంలో మేమున్నామంటూ ముందుకొచ్చారు. వీరి దారిలోనే ఇప్పుడు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు కూడా విరాళం ప్రకటించి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరారు.
Also Read-Pawan Kalyan: రూ. 6 కోట్ల విరాళం.. గొప్ప మనసు చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడలో నేను, మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు. (మొత్తం 25 లక్షలు) నా వంతు విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను’’ సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) పేర్కొనగా.. ‘‘నా వంతు బాధ్యతగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.5 లక్షలు.. మరియు గౌరవ AP డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన పంచాయితీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు, మొత్తం రూ. 15 లక్షలు విరాళంగా అందిస్తున్నాను. ఈ కష్టకాలంలో అందరం ఒకరికొకరం అండగా ఉండాలని కోరుకుంటున్నాను..’’ అని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) పిలుపునిచ్చారు.
ఇప్పటి వరకు.. ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..
పవన్ కళ్యాణ్: ఏపీకి రూ. 5 కోట్లు, తెలంగాణకు రూ. కోటి
ప్రభాస్: ఏపీకి రూ. కోటి, తెలంగాణకు రూ. కోటి
చిరంజీవి: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
బాలకృష్ణ: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
మహేష్ బాబు: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
రామ్ చరణ్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
ఎన్టీఆర్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
అల్లు అర్జున్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు
వైజయంతీ మూవీస్: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 20 లక్షలు
సిద్ధు జొన్నలగడ్డ: ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు
సాయి ధరమ్ తేజ్: ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 10 లక్షలు
వరుణ్ తేజ్: ఏపీకి రూ. 10 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
విశ్వక్ సేన్: ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
వెంకీ అట్లూరి: ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
నిర్మాత అంబికా కృష్ణ: ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
అలీ: ఏపీకి రూ. 3 లక్షలు, తెలంగాణకు రూ. 3లక్షలు
అనన్య నాగళ్ల: ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు
యాంకర్ స్రవంతి చొక్కారపు: ఏపీకి రూ. లక్ష, తెలంగాణకు రూ. లక్ష
బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి
కోట శ్రీనివాసరావు: ఏపీకి రూ. లక్ష
Read Latest Cinema News