మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shivam Media: టాలీవుడ్‌లో.. నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్‌ మీడియా’ ప్రారంభం

ABN, Publish Date - Mar 28 , 2024 | 08:56 PM

టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్‌ మీడియా’ పేరుతో ప్రారంభం అయ్యింది.

shivam

టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్‌ మీడియా’ (Sivam Media)పేరుతో ప్రారంభం అయ్యింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ శివమల్లాల ఈ బ్యానర్‌ నిర్మాత. గురువారం ఈ సినిమా శివమ్‌ మీడియా లోగో మరియు బ్యానర్‌ను ప్రముఖ నటులు అలీ (Actor Ali) నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల ( Praveena Kadiyala), అనిల్‌ కడియాల (Anil Kadiyala చేతుల మీదుగా బ్యానర్‌ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అలీ (Actor Ali) మాట్లాడుతూ..‘ శివ నా తమ్ముడు లాంటి వాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుంచి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది’ అన్నారు. అనిల్‌ కడియాల మాట్లాడుతూ.. శివ మల్లాల (Siva Mallala) తొలి రోజుల్నుంచి మాకు మంచి ఫ్రెండ్, మంచిమనిషి. అందుకే మా జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్‌ మీడియా’ అనే బ్యానర్‌ ద్వారా శివ అనేక సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.


జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత ప్రవీణా కడియాల (Praveena Kadiyala) మాట్లాడుతూ.. ‘ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్‌గా పిఆర్వోగా పనిచేసిన మా శివయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తుంది. ‘శివమ్‌ మీడియా’ (Sivam Media) విషయంలో నేను ఎంతో ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. ఈ బ్యానర్ ద్వారా డబ్బింగ్‌ సినిమానా, స్ట్రెయిట్‌ సినిమానా అనే తేడా లేకుండా అనేక మంచి సినిమాలు వస్తాయని రావాలని కోరుకుంటున్నా’ అన్నారు.

శివమ్‌ మీడియా (Sivam Media) నిర్మాత శివ మల్లాల (Siva Mallala) మాట్లాడుతూ.. ‘నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం ఎంతో హ్యాపీ. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్‌ మీడియా (Sivam Media) బ్యానర్‌పై మంచి సినిమాలు చేస్తాను’ అన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 08:56 PM