Guntur Karam: ఆ నంబర్‌తో యూట్యూబ్‌ని మడతపెట్టేసింది

ABN, Publish Date - Nov 30 , 2024 | 06:23 PM

'గుంటూరు కారం'లో సెన్సేషనల్‌ సాంగ్‌ అంటే 'కుర్చీ మడతపెట్టి’ పాటే గుర్తొస్తుంది. ఈ పాట ఎంతగా ట్రెండ్‌ అయిందో తెలిసిందే! సౌత్‌తో ఇప్పటికే చాలా రికార్డులు సొంతం చేసుకుందీ పాట.


ఈ ఏడాదికి సంక్రాంతికి 'గుంటూరు కారం'తో సందడి చేశారు మహేష్‌ బాబు(Mahesh Babu). త్రివిక్రమ్‌ (Trivikram) తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే పాటలు మాత్రం సంగీత ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం సారధ్యంలో వచ్చిన ఈ చిత్రం పాటలన్నీ చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇక ఇందులో సెన్సేషనల్‌ సాంగ్‌ అంటే 'కుర్చీ మడతపెట్టి’ పాటే గుర్తొస్తుంది. ఈ పాట ఎంతగా ట్రెండ్‌ అయిందో తెలిసిందే! సౌత్‌తో ఇప్పటికే చాలా రికార్డులు సొంతం చేసుకుందీ పాట.

లిరికల్‌ సాంగ్‌తోపాటు, వీడియో సాంగ్‌ కూడా వ్యూవర్‌షిప్‌లో టాప్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాట మరో మైండ్‌ బ్లాకింగ్‌ రికార్డు సెట్‌ చేసింది. లేటెస్ట్‌గా ఈ ఫుల్‌ వీడియో సాంగ్‌ ఏకంగా 500 మిలియన్‌ వ్యూస్‌ (Kurchi Madathapetti song 500 million views) అందుకొని మహేష్‌ ఖాతాలో హాఫ్‌ బిలియన్‌ వ్యూస్‌ ఉన్న సాంగ్‌గా రికార్డు సృష్టించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. పాటలు మాత్రం ఈ రేంజ్‌లో దుమ్ము లేపాయని చెప్పాలి. ఈ విషయాన్ని చెబుతూ ఆదిత్యా మ్యూజిక్‌ (Adithya Music) ఆడియో సంస్థ ట్వీట్‌ చేసింది.

ప్రస్తుతం మహేశ్‌ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ 29 చేయబోతున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌ ఈ సినిమా కోసం కసరత్తులు ఫొటో షూట్స్‌ పూర్తి చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుందని తెలుస్తుంది. 

Updated Date - Nov 30 , 2024 | 06:26 PM