Kubera: ఆ డేట్స్‌లో ఖాయమేనా!

ABN, Publish Date - Nov 26 , 2024 | 09:47 AM

ధనుష్‌(Dhanush), నాగార్జున (Nagarjuna) కీలక పాత్రధారులుగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కుబేర’ (kubera). శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ధనుష్‌(Dhanush), నాగార్జున (Nagarjuna) కీలక పాత్రధారులుగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కుబేర’ (kubera). శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మూడో వారాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. భిన్నమైన సోషల్‌ డ్రామాతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో ధనుష్‌ మునుపెన్నడూ చేయని కొత్త పాత్రలో కనిపించనున్నారు. నాగ్‌ ఈడీ అధికారి పాత్ర పోషిస్తున్నట్లు టాక్‌. ఇప్పటికే విడుదలైన టుక్‌, టీజర్స్‌ ఆకట్టుకున్నాయి.

Updated Date - Nov 26 , 2024 | 09:47 AM