KTR: నటి గౌతమి పక్కన కూర్చోడానికి నిరాకరించిన కేటీఆర్.. ఓకే అన్న ప్రకాష్ రాజ్

ABN, Publish Date - Oct 26 , 2024 | 12:50 PM

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో కేటీఆర్.. సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్, నటి గౌతమిలతో కలిసి పాల్గొన్నాడు. అయితే నటి గౌతమి పక్కన కూర్చోవడానికి ఆయన నిరాకరించారు. ఇంతకీ ఏమైందంటే..

తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తరుచుగా ఎదో ఒక వివాదంతో సినిమా వార్తల్లో కనిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆయన సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) , నటి గౌతమిల (Gautami)తో కలిసి పాల్గొన్నాడు. అయితే నటి గౌతమి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరించారు. ఇంతకీ ఏమైందంటే..


తాజాగా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో సీనియర్ నటి, పొలిటీషియన్ గౌతమి కేటీఆర్, ప్రకాష్ రాజ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో గౌతమి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరించాడు. సుదీర్ఘ కాలం క్యాన్సర్‌తో పోరాటం చేసిన గౌతమి ఎట్టకేలకు క్యాన్సర్ మహమ్మారిని జయించారు. అయితే "ఇప్పుడే పబ్లిక్ మీటింగ్ నుంచి వచ్చా.. పక్కనే కూర్చుంటే మీకు ఇన్ఫెక్షన్" అంటూ వేరేవైపు కూర్చొని.. ప్రకాష్ రాజ్‌ని అటువైపు కూర్చోమన్నారు. అంతకు ముందు ప్రకాష్‌ని హగ్ చేసుకున్న కేటీఆర్ "యూ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్.. కీప్ ఫైటింగ్" అన్నారు. తర్వాత ఆయన గౌతమిని పలకరించారు. గౌతమితో కేటీఆర్ మాట్లాడుతూ.. నేను మీ పక్కన కూర్చునే బదులు హ్యాండ్సమ్ మాన్ కూర్చుంటేనే బాగుంటుందని ప్రకాష్ రాజ్‌కి పరోక్షంగా కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో ప్రకాష్ రాజ్ అమ్యూజ్ అయ్యారు


నటి గౌతమి పుట్టింది తెలుగింట్లో అయినా సౌత్ ఇండియా వైడ్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఆమె తర్వాత 13 ఏళ్ళు కమల్ హాసన్‌తో రిలేషన్షిప్ మెయింటేన్ చేసి విడిపోయారు. సినిమాలతో పాటు దశాబ్ద కాలం బీజేపీ పార్టీతో అనుబంధం కొనసాగించిన ఆమె గత సంవత్సరం ఏఐఏడీఎంకే (AIDMK) పార్టీలో చేరారు. అలాగే తన ఛారిటీ సంస్థతో క్యాన్సర్ పేషేంట్స్‌కి సేవలందిస్తున్నారు.

Updated Date - Oct 26 , 2024 | 12:50 PM