Krishna Vamsi: పవన్ తో సినిమా తీస్తే.. ఏమయ్యేదంటే 

ABN, Publish Date - Aug 12 , 2024 | 07:18 PM

కొంతకాలంగా సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) సమయం దొరికిన ప్రతిసారీ ఎక్స్‌ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంటారు. 'మురారి రీ రిలీజ్‌ (Murari) నేపథ్యంలో తాజాగా ఆయన ఎక్స్‌లో మాట్లాడారు.  

కొంతకాలంగా సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) సమయం దొరికిన ప్రతిసారీ ఎక్స్‌ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంటారు. 'మురారి రీ రిలీజ్‌ (Murari) నేపథ్యంలో తాజాగా ఆయన ఎక్స్‌లో మాట్లాడారు.  పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఇందులో ‘మురారి’ సీక్వెల్‌ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, పవన్‌ కల్యాణ్‌తో సినిమా గురించి కూడా చెప్పారు. ‘‘మహేశ్‌ బాబు తనయుడు గౌతమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రెండేళ్ల తర్వాత ‘మురారి’ సీక్వెల్‌ తెరకెక్కించండి’’ అని నెటిజన్‌ అడగ్గా.. ‘‘ఆ విషయాన్ని మీరు, నేను చెప్పకూడదు. మహేశ్‌, నమ్రత, గౌతమ్‌ నిర్ణయించాలి. కాబట్టి వాళ్లనే డిసైడ్‌ చేయనిద్దాం’’ అని చెప్పారు. ‘పవన్‌కల్యాణ్‌కు మీరు ఎప్పుడైనా స్టోరీ చెప్పారా? మీ కాంబోలో సినిమా వస్తే బాగుండేది’’ అని మరో నెటిజన్ కోరగా దీనిపై దర్శకుడు స్పందించారు. ‘‘చెప్పాను. సినిమా చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. ఆ ఛాన్స్ మిస్‌ చేసుకున్నా. ఒకవేళ ఆ సినిమా వచ్చి ఉంటే బాక్సాఫీస్‌ వద్ద పెద్ద బ్లాస్ట్‌ అయ్యేది. అది నా దురదృష్టం అంతే’’ అని అన్నారు. ‘‘మీరు ఏం చేస్తారో తెలియదు. మాకు మీ నుంచి మురారి లాంటి చిత్రాలు కావాలి అంతే మీదే బాధ్యత’’ అని నెటిజన్‌ అనగా.. ‘‘సరే డబ్బులు తీసుకుని వచ్చేయండి?. సినిమా తీద్దాం’’ అని సరదాగా సమాధానమిచ్చారు.

కృష్ణవంశీ - మహేశ్‌బాబు (mahesh Babu) కాంబినేషన్‌లో వచ్చిన ‘మురారి’ చిత్రం అప్పట్లో ఒకట్రెండ్‌ సెట్టర్‌. మహేశ్ కెరీర్‌కు చాలా కీలకమైన సినిమాగా మారింది. ఫ్యామిలీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. చాలా థియేటర్లలో 100 రోజులు ఆడింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోన్న తరుణంలో ఆగస్ట్‌ 9న మహేశ పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను 4కె వెర్షన్లలో విడుదల చేశారు. చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దాదాపు రూ.7 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - Aug 12 , 2024 | 07:21 PM