Konidela Surekha: ఆయనలానే కల్యాణ్‌బాబు.. నాగబాబుకు మాత్రం!
ABN, Publish Date - Mar 08 , 2024 | 03:52 PM
చిరంజీవి ఆహార అలవాట్ల గురించి కొణిదెల సురేఖ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా 'నవ్య’తో మాట్లాడారు.
చిరంజీవి (Chiranjeevi) ఆహార అలవాట్ల గురించి కొణిదెల సురేఖ (Surekha konidela) ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా 'నవ్య’తో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో చిరు, పవన్(Pawan kalyan), నాగబాబు (Nagababu) ఆహారం ఎలా తీసుకుంటారు? అన్న ఆసక్తికర విషయాల గురించి ఆమె మాట్లాడారు.
"చిరంజీవిగారు భోజనం విషయంలో అసలు ఆలోచించారు. ఏది పెట్టినా తినేస్తారు. చివరకు పచ్చడి అన్నం పెట్టినా మాట్లాడకుండా తృప్తిగా తింటారు. నాగబాబుకు అలా కాదు. అన్ని రుచులు కావాలి. కళ్యాణ్‌బాబుది వాళ్ల అన్నయ్య వరసే. ఎటువంటి డిమాండ్లూ ఉండవు. ఏది పెట్టినా తినేస్తాడు. ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా చెప్పాలి. మామయ్యగారు చక్కగా తినేవారు. ఆయన తినటం చూస్తే- మిగిలిన వాళ్లకు కూడా తినాలనిపిస్తుంది. అదొక కళ.. అమ్మ నాకు చిన్నప్పటి నుంచి- అందరికీ పెట్టడం నేర్పింది. ఎవరైనా తృప్తిగా తింటుంటే ఇంకా పెట్టాలనిపిస్తుంటుంది.. తినేవాళ్లకు పెట్టడంలో లభించే తృప్తి వేరు’’ అని అన్నారు.
నా వంటింటి గురువు ఆయనే...
అయితే పెళ్లికి ముందు వంట అసలు రాదని చెప్పిన ఆమె ఇప్పుడు వంట చేయడంలో పర్ఫెక్ట్ అని అన్నారు. "మా అమ్మ వాళ్లింట్లో నేనే చిన్నదాన్ని. కూరలు తరగటం లాంటి చిన్న చిన్న సాయాలు చేయటం తప్ప వండటం రాదు. పెళ్లి అయిన తర్వాత అన్నీ నేర్చుకున్నా. ఇక్కడ మీకో రహస్యం చెబుతా. వంటలో నాకు గురువు- మా ఆయనే. మామయ్యగారు భోజన ప్రియులు. మా అత్తయ్యగారు చాలా బాగా వండుతారు. దాంతో ఆయన చిన్నప్పుడు రకరకాల వంటలు వండేవారట. మాకు పెళ్లైన కొత్తల్లో- అత్తమ్మ లాగ నేను కూడా వంటచేేస్త బావుండునని ఆయనకు ఉండేది. కానీ నాకు రాదు. కాపురానికి వెళ్లిన తర్వాత- ఒక రోజు ఉప్మా చేశా. ఉండలు ఉండలుగా వచ్చింది. అప్పటిదాకా ఉప్మా అలాగే చేస్తారనుకొనేదాన్ని. ఆ తర్వాత ఆయనే నాకు ఉప్మా చేయటం, ఇతర వంటలు వండటం నేర్పారు. మా ఇంట్లో ఉప్మా- ఇప్పుడు చాలా ఫేమస్. చాలా మంది అడిగిమరీ తింటారు.
-------------------------------