Konidela Nagababu: పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది..!
ABN, Publish Date - Jun 21 , 2024 | 02:06 PM
పవన్ కల్యాణ్ (Pawan kalyan) అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (Ap Assembly) ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో తన తమ్ముడిని చూసి కొణిదెల నాగబాబు (Nagababu konidela) భావోద్వేగానికి లోనయ్యారు.
పవన్ కల్యాణ్ (Pawan kalyan) అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (Ap Assembly) ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో తన తమ్ముడిని చూసి కొణిదెల నాగబాబు (Nagababu konidela) భావోద్వేగానికి లోనయ్యారు. అసెంబ్లీ గ్యాలరీ లో కూర్చుని సభను వీక్షించిన ఆయన డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్న తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని చూసి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందని తెలిపారు. ఈ మేరకు భావోద్వేగంలో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "తోడబుట్టిన వాడిగా, జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలి ‘పవన్ కళ్యాణ్ అను నేను’ అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి. చాలా థ్రిల్‌గా ఉంది. మా కుటుంబం అంతా కూటమిలో కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్థితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు నాగబాబు. ఆయన ట్వీట్‌తో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. 'అసెంబ్లీ గేట్ దగ్గరకు కూడా రాలేడు' అన్న వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు జనసైనికులు, కార్యకర్తలు.