Konda Surekha: నాగార్జునకి కొండా సురేఖ కౌంటర్.. నేడే విచారణ

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:48 PM

నటుడు నాగార్జున తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి సురేఖ నాగార్జునకి కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఏమైందంటే..

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) సినీ న‌టుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)వేసిన పిటిషన్‎పై నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు. అనంతరం కోర్టు నాగార్జున, ఇతర సాక్షుల వాంగ్మూలాలని రికార్డ్ చేశారు. తాజాగా ఈ పిటిషన్ కి మంత్రి కొండా సురేఖ కౌంటర్ వేసింది.


తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అలాగే పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కి కౌంటర్ ఇస్తూ కొండా మంత్రి సురేఖ నాంపల్లి స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఈరోజు కోర్టు ఆమె లాయర్ గురుమిత్ సింగ్ వాదనలు విననున్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.


గాంధీ జయంతి సందర్భంగా బాపు ఘాట్‌లో నివాళులు అర్పించి కొండా సురేఖ మీడియాతో కేటీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘N కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంత నా దగ్గరకు రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టాడు. నాగార్జున (King Nagarjuna), నాగ చైతన్య మాట్లాడి సమంతను కేటీఆర్ (KTR) దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారు. కేటీఆర్ దగ్గరికి వెళ్ళడానికి సమంత ఒప్పుకోలేదు. కేటీఆర్ దగ్గరకి వెళ్ళకపోతే మా ఇంట్లో ఉంటే ఉండు.. లేకపోతే వెళ్ళిపో అన్నారు. అది భరించలేకనే సమంత విడాకులు తీసుకుంది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 21 , 2024 | 01:43 PM