Biggboss Elimination: కిర్రాక్ సీత అవుట్... కారణం!
ABN, Publish Date - Oct 14 , 2024 | 08:32 AM
తెలుగు బిగ్‌బాస్ సీజన్-8లో మరో ఎలిమినేషన్ జరిగింది. కిర్రాక్ సీత ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిందని వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు.
తెలుగు బిగ్‌బాస్ సీజన్-8లో (Biggboss 8)మరో ఎలిమినేషన్ జరిగింది. కిర్రాక్ సీత (Kirrak Seeta) ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిందని వ్యాఖ్యాత నాగార్జున (Nagarjuna) ప్రకటించారు. దసరా సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఎపిసోడ్ విశేషంగా అలరించింది. ‘విశ్వం’ (Vishwam) చిత్ర ప్రచారంలో భాగంగా దర్శకుడు శ్రీనువైట్ల, కథానాయకుడు గోపిచంద్ వచ్చి సందడి చేశారు. ఈ వారం నామినేషన్స్‌లో గంగవ్వ, కిర్రాక్ సీత, పృథ్వీ, మెహబూబ్, విష్ణుప్రియ యష్మి ఉండగా, చివరకు మెహబూబ్, సీత మిగిలారు. వీరిద్దరిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన సీత ఎలిమినేట్ అయింది. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన ఆమె మాట్లాడుతూ. ‘‘ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు. నా ఆట ఎక్కడో ప్రేక్షకులకు నచ్చలేదనుకుంటా. లైఫ్‌లో ఎన్నో కష్టాలు చూశాను. ఇది పెద్ద విషయమేమీ కాదు’’ అని అంది. హౌస్‌లో జరిగిన ఓ టాస్క్‌లో సీత ఆడదామనుకున్నా, మెగా చీఫ్ అయిన మెహబూబ్.. విష్ణు, నైనికను పంపాడు. ఆ టాస్క్ గెలిచి సీత తన తండ్రికి బైక్ గిఫ్ట్ ఇద్దామనుకుందట. అందుకు బాధపడిన మెహబూబ్ బయటకు వచ్చాక ఆ బైక్‌ను గిప్ట్‌గా ఇస్తానని మాటిచ్చాడు.
వైట్ హార్ట్...
విష్ణుప్రియ: చాలా అమాయకురాలు. గేమ్ షో గురించి పెద్దగా అర్థం కాదు. కానీ, ఆమెలో ఫైర్ ఉంది. నువ్వు బయటకు వెళ్ళాక మీ అమ్మను మర్చిపోయేంత ప్రేమ దొరకాలి. నువ్వు పెళ్లి చేసుకునే పార్ట్‌నర్ కోసం ప్రార్థిస్తా నిన్ను బాగా చూసుకుంటాడు. కృష్ణుడు నాతో పలికిస్తున్న మాటలివి. నిన్ను ఫైనల్స్‌లో చూడాలనుకుంటున్నా.
నబీల్: నాకు తమ్ముడు లాంటివాడు. చాలా బాగా ఆడతాడు. రియాల్టీ షోలో రియల్ పీపుల్ గెలవాలని అనుకుంటున్నా.
అవినాష్: తను ఇంట్లోకి వచ్చాక పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చాడు. వచ్చి వారం రోజులే అయినా, తను మాట్లాడుతుంటే నవ్వుతూనే ఉన్నాను. నాలో ఆ జోష్ తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ.
బ్లాక్ హార్ట్
నిఖిల్: పర్‌ఫెక్ట్ హజ్బెండ్ మెటీరియల్. కానీ, ఒక్క మైనస్. పారదర్శకంగా ఉండు. ఫిజికల్ టాస్క్‌లు బాగా ఆడతాడు. ఎవరో నిన్ను రైట్ అనుకోవాలని, అక్కడవి ఇక్కడ చెప్పకు. నీకు నచ్చింది మాట్లాడు.
గౌతమ్: నువ్వు ఇచ్చిన జోష్ బాగా నచ్చింది. చిన్న చిన్న విషయాలకు బాధపడకు. నీ నుంచి చాలా ఆశిస్తున్నాం. నిన్ను నీవు నిరూపించుకో. నిజాయతీతో ఉండు.
నయని పావని: నేను ఏడుస్తూ ఉంటానని నామినేట్ చేశావు. నువ్వే ఎక్కువ ఏడుస్తున్నావు. గెలవాలన్న పట్టుదలతో ఆడు. ఈసారి ఎక్కువ రోజులు ఉండాలని కోరుకుంటున్నా.