Biggboss8 Telugu: బిగ్‌బాస్‌లో.. ఆ క‌ల మాత్రం తీర‌లే! హౌస్‌లో టేస్టీ తేజ చిరాకు

ABN, Publish Date - Oct 15 , 2024 | 07:04 AM

రీసెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌ నుంచి కిర్రాక్‌ సీత బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం బిగ్ బాస్ బజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నఆమె ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకుంది.

seetha

రీసెంట్‌గా బిగ్‌బాస్ (Biggboss8) హౌస్‌ నుంచి కిర్రాక్‌ సీత (Kirrak Seeta) బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో నాగార్జున ఇక హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరికి వైట్‌ హార్ట్‌, బ్లాక్‌ హార్ట్‌ ఇస్తావని నాగార్జున అడగ్గా ఒక్కొక్కరిపై తన అభిప్రాయం చెప్పింది. త‌న ఫ్రెండ్ అయిన విష్ణు ప్రియ కాకుంగా న‌బీల్ విజ‌యం సాధించాల‌ని చెప్పి షాక్‌కు గురి చేసింది. అనంత‌రం అంబ‌టి అర్జున్ యాంక‌ర్‌గా ఉన్న‌ బిగ్ బాస్ బజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీత (Kirrak Seeta) మ‌రికొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకుంది.

హౌస్‌లో మీ పతనం ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాన్ని మీరు గమనించారా ?’ అని అడగ్గా.. టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్ళని పంపడం వల్ల డౌన్ అయ్యానని నేను అనుకుంటున్నాని తెలిపింది. ఏడవడం అనేది స్ట్రాంగా? అని అడిగ‌గా.. మరి అరవడం స్ట్రాంగా ? అంటూ సీత (Kirrak Seeta) కౌంటర్ ఇచ్చింది. ‘మీ మంచితనమే కొంపముంచిందని మీరు ఎప్పుడూ అనుకోలేదా అని అర్జున్ అడగ‌గా.. దానికి సీత అదేం లేదని వివ‌రించింది. అపై త‌న‌కు న‌చ్చ‌ని వారి ఫొటోల‌ను సీత వేస్ట్‌బిన్‌లో ప‌డేసే క్ర‌మంలో హౌజ్‌లో టేస్టీ తేజ చిరాకుగా అనిపించాడంటూ వారమైనా పెద్దగా పర్ఫామ్ చేసినట్టు అనిపించలేదని అత‌ని పొటో వేస్ట్ బిన్ లో పడేసింది.

మీ అమ్మ ఓ లెటర్ పంపించింది కదా.. అందులో ఏముంది? అని అర్జున్ అడగ్గా సీత (Kirrak Seeta) కాసేపు ఎమోషనల్ అయ్యింది. ‘దాని గురించి నాకు అసలు ఆలోచించాలనే లేదు. నేను నాలాగే ఉన్నా, సంతోషంగా బయటకు వచ్చా. కానీ మా అమ్మని బిగ్‌బాస్‌ హౌస్‌లో చూడాలనుకున్న కల ఒక‌టి మాత్రం తీరలేదంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌యింది. ఇదిలాఉండ‌గా ఈ వారం 9మంది నామినేష‌న్ల‌లోకి రాగా టేస్టీ తేజ, పృథ్వి, గౌతమ్ డేంజ‌ర్ జోన్‌లో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 15 , 2024 | 07:04 AM