Kiran Abbavaram: ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని 'క' సినిమా ఇచ్చింది. 

ABN, Publish Date - Nov 30 , 2024 | 08:32 PM

మంచి సినిమా చేస్తే ఆడియెన్స్ ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని 'క' సినిమా ఇచ్చింది అన్నారు కిరణ్ అబ్బవరం


థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)నటించిన 'క' (KA Movie) చిత్రం.  నయన్ సారిక (Nayan Sarika), తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ "క" సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయగా..మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై డిస్ట్రిబ్యూట్ చేశారు. దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ ఈటీవీ విన్ లో డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో స్ట్రీమింగ్ కు వచ్చి అక్కడా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. అతి తక్కువ టైమ్ లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఈ సందర్భంగా “క“ బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.  

దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ " క సినిమాకు థియేటర్స్ లో వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ ఇప్పుడు ఈటీవీ విన్ లో రావడం సంతోషంగా ఉంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో క ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. డాల్బీలో చూస్తే సీన్స్ లోని ప్రతి డీటెయిలింగ్ బాగా తెలుస్తుంది. అలాగే అట్మాస్ లో సౌండ్ ను క్లియర్ గా వింటూ దాని థీమ్ ను అర్థం చేసుకుంటారు.  ఈ సినిమా విషయంలో మాకు కిరణ్ గారు, ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేం" అన్నారు.

ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ - క సినిమాను థియేటర్స్ లో చూసినప్పుడు ఈ మూవీ తప్పకుండా ఈటీవీ విన్ కు తీసుకోవాలని అనుకున్నాం. అయితే కొత్తగా ఎలా ప్రెజెంట్ చేయొచ్చని ఆలోచించినప్పుడు డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో తీసుకురావాలని కిరణ్ గారితో డిస్కస్ చేసి నిర్ణయించాం. ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తక్కువ టైమ్ లో 100 మిలియన్ మినట్స్ వ్యూయర్ షిప్ దక్కడం సంతోషంగా ఉంది. మీరంత క సినిమాను ఈటీవీ విన్ లో తప్పకుండా చూడండి. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - క సినిమాకు మేము ఎంతగా ప్రమోషన్ చేశామో, ఈటీవీ విన్ టీమ్ అంతా అంతే ప్రమోషన్ చేసి ఆడియెన్స్ కు సినిమా బాగా రీచ్ అయ్యేలా చేస్తున్నారు. పైరసీ అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరి ఇంటికి క సినిమాను చేర్చారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో మా సినిమా మరింత డీటెయిలింగ్ గా సౌండ్, విజువల్స్ మరింతగా ఆకట్టుకుంటాయి. థియేటర్ లో క సినిమా చూసిన వాళ్లు కూడా మరోసారి ఈటీవీ విన్ లో చూడండి. ఎందుకంటే సెకండ్ టైమ్ ఇంకా బాగా అనిపించింది అని చాలామంది చెబుతున్నారు.  మంచి సినిమా చేస్తే ఆడియెన్స్ ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని క సినిమా ఇచ్చింది. అన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 08:32 PM