కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

King Nagarjuna: రాసిపెట్టికోండి.. కిష్టయ్య బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు

ABN, Publish Date - Jan 11 , 2024 | 11:55 AM

మూడు నెలల్లో సినిమా ఎలా తీయొచ్చు అనేది ఒక పుస్తకం కూడా రాసిస్తాం. సినిమా విడుదల సందర్భంగా అక్కినేని అభిమానులకు ఒక మాట చెప్పాలి. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు.. అని అన్నారు కింగ్ నాగార్జున. ఆయన హీరోగా నటించిన ‘నా సామిరంగ’ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

King Nagarjuna

కింగ్ నాగార్జున నటించిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (Vijay Binni) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి (MM Keeravani) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కింగ్ నాగార్జున సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున (King Nagarjuna) మాట్లాడుతూ.. ‘‘సంక్రాంతి అంటే సినిమా పండగ. టీవీలు వచ్చినపుడు సినిమాలు ఇక చూడరని అన్నారు. తర్వాత ఫోన్లు వచ్చాయి.. చూడరని అన్నారు. డీవీడీలు, డిజిటల్ వచ్చిన తర్వాత చూడరని అన్నారు. కానీ ప్రేక్షకులు సినిమాలు చూస్తూనే వున్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత చూడరు అన్నారు. కానీ చూస్తూనే వున్నారు. కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే వున్నారు. పండగ రోజున సినిమా చూడటం అనేది ఆనవాయితీ. నాలుగు సినిమాలు వచ్చినా చూస్తారు. మన తెలుగువారికి సంక్రాంతి అంటే సినిమా పండగ. ఈ సంక్రాంతి నాలుగు సినిమాలు వస్తున్నాయి. పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ‘గుంటూరు కారం’తో వస్తున్న మహేష్ బాబుకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. బాల నటుడిగా తేజని చూశాను. ఇప్పుడు తను హీరోగా ‘హను-మాన్’ అనే సినిమాతో వస్తున్నాడు. తనకి ఆల్ ది బెస్ట్. మా వెంకీ 75వ చిత్రంగా ‘సైంధవ్’తో వస్తున్నారు. తనకి ఆల్ ది బెస్ట్. మేము ‘నా సామిరంగ’తో వస్తున్నాం. మేము ఇచ్చే సినిమా మీకు నచ్చితే ఎంత ఆదరిస్తారో అలా రెండు పండగలు చూశాం. మీకు సినిమా నచ్చుతుంది. ఈ పండక్కి కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. (Naa Saami Ranga Pre Release Event)


మా సినిమాకి స్టార్ కీరవాణి గారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాటలు ఇచ్చారు. ఈ సినిమాని మూడు నెలల్లో పూర్తి చేశామంటే ఆయన మా వెనుక వుండి ముందుకు నడిపించారు. సినిమా స్టార్ట్ అవ్వకముందే మూడు పాటలు, ఒక యాక్షన్ సీక్వెన్స్‌కి నేపధ్య సంగీతం చేసి మా ముందు పెట్టారు. కీరవాణి గారు లాంటి టెక్నిషియన్ వుంటే ఏదైనా సాధిస్తాం. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ వెన్నుతట్టి ఆయన వెనుక వుండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు ప్రోత్సహించారు. మూడు నెలలు పాటు టీం అంతా ఒక ఫ్యామిలీలా వుండి ఈ సినిమా తీశాం. మూడు నెలల్లో సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. కానీ చేశాం. ఈ కష్టం ఫలించిందా లేదా అనేది జనవరి 14న తెలుస్తుంది. సెప్టెంబర్ 20 నాన్నగారి పుట్టినరోజున ఆయనకి వందేళ్ళు వచ్చిన రోజున ఆయన విగ్రహం ఆవిష్కరించినపుడు ఆయనకి నమస్కరించుకునప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ‘వెళ్లి సినిమా చేయ్.. నా సామిరంగ’ అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతో సినిమాని పూర్తి చేశాం. ఈ టీం గురించి, వాళ్ళు పడిన కష్టం గురించి ఇప్పుడు చెప్పను.. సక్సెస్ మీట్‌లో చెప్తాను. మూడు నెలల్లో సినిమా ఎలా తీయొచ్చు అనేది ఒక పుస్తకం కూడా రాసిస్తాం. సినిమా విడుదల సందర్భంగా అక్కినేని అభిమానులకు ఒక మాట చెప్పాలి. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Deviyani Sharma: ఆ హీరో సరసన నటించాలన్నదే నా జీవితాశయం

***************************

*Lavanya Tripathi: పాపం.. లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు..

***********************

*Janhvi Kapoor: ప్రేమలో పడిపోయా.. నాని ‘హాయ్ నాన్న’పై జాన్వీకపూర్

************************

*నన్ను క్షమించు స్వామీ... కెప్టెన్‌ సమాధి వద్ద హీరో విశాల్‌ భావోద్వేగం

***************************

Updated Date - Jan 11 , 2024 | 11:55 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!