King Nagarjuna: ‘సత్యం సుందరం’ సినిమా చూసిన నాగ్ స్పందనిదే..

ABN, Publish Date - Sep 30 , 2024 | 10:50 AM

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. ‘96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన కింగ్ నాగార్జున తన రివ్యూని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆయన ఏమన్నారంటే..

King Nagarjuna on Sathyam Sundaram

హీరో కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Arvind Swami) లీడ్ రోల్స్‌లో నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram). ‘96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు అందించారు. ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌తో అదిరిపోయేలా ప్రశంసలను అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా చూసిన కింగ్ నాగార్జున (King Nagarjuna) ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా తన స్పందనను తెలియజేస్తూ.. యూనిట్‌‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కింగ్ నాగ్ ఏమన్నారంటే..

Also Read- Aishwarya Lekshmi: నన్ను సింగిల్‌గా ఉండనివ్వరా..

‘‘డియర్ కార్తీ.. నిన్న రాత్రి మీ సినిమా ‘సత్యం సుందరం’ చూశాను. నువ్వు, అరవింద్ స్వామిగారు చాలా బాగా చేశారు. సినిమాలో నిన్ను చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. అలాగే నవ్వుతో హాయిగా నిద్రపోయాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాను. అలాగే మన ‘ఊపిరి’ సినిమా జ్ఞాపకాలను కూడా గుర్తు తెచ్చుకున్నాను. ప్రేక్షకులు మరియు విమర్శకులు ఇలాంటి హార్ట్ టచ్చింగ్ సినిమాల గురించి పాజిటివ్‌గా స్పందిస్తూ.. అభినందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ టీమ్ అందరికీ అభినందనలు’’ అంటూ కింగ్ నాగార్జున ‘సత్యం సుందరం’ సినిమాపై తన రివ్యూని ఇచ్చేశారు. (King Nagarjuna Review on Sathyam Sundaram)

Also Read- Satyam Sundaram Review: కార్తీ నటించిన 'సత్యం సుందరం' సినిమా ఎలా ఉందంటే..


ఒక్క నాగార్జున అనే కాదు.. ఈ సినిమాను చూసిన వారంతా ఇలాగే స్పందిస్తుండటం విశేషం. దర్శకుడు ప్రేమ్ కుమార్ ‘96’ సినిమాతోనే ప్రేక్షకులందరి హార్ట్‌ని దోచేశాడు. ఆయన నుంచి వచ్చిన ‘సత్యం సుందరం’ సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల మెప్పును పొందడం గమనార్హం. అలాగే ఈ సినిమాలో కార్తీ నటనకు కూడా జనాలు నీరాజనాలు పడుతున్నారు. అలాగే ‘96’కి సంగీతం అందించిన గోవింద్‌ వసంత్‌.. ఈ సినిమాకు కూడా మరోసారి తన ప్రతిభను కనబరిచారు. ప్రస్తుతం ఈ సినిమాకు కలెక్షన్స్ పుంజుకుంటున్నాయి. ‘దేవర’ వీకెండ్ అంతా డామినేట్ చేయడంతో.. ఈ సినిమాకు అనుకున్నంతగా కలెక్షన్స్ రాలేదు కానీ.. మౌత్ టాక్ ఈ సినిమాకు పాజిటివ్‌గా ఉండటంతో ఈ వారం ఈ సినిమా థియేటర్లలో మంచి పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది.

Also Read- Sai Durgha Tej: మేనమామల దారిలో సాయి దుర్గ తేజ్.. తగ్గేదేలే

Also Read- Prakash Raj: గుడికెళ్లిన ప్రకాష్ రాజ్.. ఫ్యాన్స్ ఫైర్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2024 | 10:50 AM