Kichcha Sudeep: ‘హనుమాన్‌’ నిర్మాతలు మరో సినిమా.. కాన్సెప్ట్‌ వీడియో!

ABN, Publish Date - Sep 02 , 2024 | 01:40 PM

‘హనుమాన్‌’తో (Hanuman) భారీ విజయం అందుకొంది  ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. తాజాగా ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది.


‘హనుమాన్‌’తో (Hanuman) భారీ విజయం అందుకొంది  ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. తాజాగా ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది. కిచ్చా సుదీప్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మేరకు సోమవారం సుదీప్‌ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమా విశేషాలను వెల్లడించారు. ‘విక్రాంత్‌ రోణ’ (Vikranth Rona) ఫేమ్‌ అనూప్‌ భండారీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి ‘బిల్లారంగా భాషా -ఫస్ట్‌ బ్లడ్‌’ (Billa Ranga Basha- First blood) అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.  భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈమేరకు కాన్సెప్ట్‌ వీడియో షేర్‌ చేశారు నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, చైతన్య.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Updated Date - Sep 02 , 2024 | 01:44 PM