మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kevvu Kartheek: నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు

ABN, Publish Date - May 16 , 2024 | 04:45 PM

జబర్దస్త్‌ హాస్య నటుడు కెవ్వు కార్తిక్‌  (Kevvu Kartheek) ఇంట విషాదం  నెలకొంది. కొంతకాలంగా కేన్సర్స్‌తో (Cancer patient) పొరాటం చేస్తున్న ఆయన తల్లి తుది శ్వాస విడిచారు.

జబర్దస్త్‌ హాస్య నటుడు కెవ్వు కార్తిక్‌  (Kevvu Kartheek) ఇంట విషాదం  నెలకొంది. కొంతకాలంగా కేన్సర్స్‌తో (Cancer patient) పొరాటం చేస్తున్న ఆయన తల్లి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కార్తిక్‌ ఆమెను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘ఐదు సంవత్సరాలుగా క్యాన్సరే భయపడే విధంగా దానితో పోరాటం చేశావు. నీ జీవితమంతా యుద్థమే. మమ్మల్ని, నాన్నను కంటికి రెప్పలా చూసుకున్నావ్‌. కష్ట పరిస్థితుల్లో కుటుంబాన్ని కాపాడావు. దేనితోనైనా ఒంటరిగా ఎలా పోరాటం చేయాలో ఈ 5 ఏళ్లలో నేర్పించావు. నాలో ధైర్యాన్ని నింపావు. అన్నీ నేర్పావు.. కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు’ అని  ఇన్స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

తన మాతృమూర్తికి చికిత్స చేసిన డాక్టర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కార్తిక్‌కు ధైర్యం చెబుతున్నారు. ‘జబర్దస్త్‌’తో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్‌.. పలు సినిమాల్లోనూ నటించారు. 

Kangana Ranaut: లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడం కారణంగా ఆలస్యం!



Updated Date - May 16 , 2024 | 05:28 PM