Keerthy Suresh Wedding: ఎంత సక్కగా ఉన్నవే.. కీర్తి సురేష్ పెళ్లి

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:14 PM

నటి కీర్తి సురేష్ పెళ్లి గోవాలో ఘనంగా జరిగింది. పెళ్లి కూతురిగా కీర్తి సురేష్‌ని చూసిన అభిమానులు ఎంత సక్కగా ఉన్నవే.. అంటూ కామెంట్ చేస్తున్నారు.

తాజాగా మహానటి 'కీర్తి సురేష్' పెళ్లి గోవాలోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్‌లో జరిగింది. పెళ్లికి రెండు రోజుల ముందే డిసెంబరు 9న వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి. కీర్తి తన చిన్న నాటి మిత్రుడు, వ్యాపారవేత్త 'ఆంటోనీ తట్టిల్‌'ని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య 15 ఏళ్ల నుండి ప్రేమాయణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.


మరోవైపు ఆమె త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేయనుంది. దళపతి విజయ్, సమంత జంటగా కలిసి నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'తేరి' సినిమాని బాలీవుడ్‌లో బేబీ జాన్‌గా రీమేక్ చేయనున్నారు. ఇందులో హీరోగా వరుణ్ ధావన్ నటించనుండగా, సమంత పాత్రని కీర్తి సురేష్ పోషించనుంది.

Updated Date - Dec 12 , 2024 | 03:26 PM