Kartikeya : ప్రణీత్ హనుమంతు చేష్టలపై కార్తికేయ ఫైర్
ABN, Publish Date - Jul 08 , 2024 | 08:04 PM
యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా మారిన ప్రణీత్ హనుమంతు వ్యవహారం మీద సినీ సెలబ్రిటీలు ఒక్కరక్కరుగా స్పందిస్తున్నారు. ఓ తండ్రీ కూతురు వీడియో విషయంలో ప్రణీత్, అతని స్నేహితులు చేసిన కామెంట్స్ విషయంలో తొలుత సాయిధరమ్ తేజ్ ఫైర్ అవుతూ ఓ పోస్ట్ చేశారు
యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా మారిన ప్రణీత్ హనుమంతు(Praneeth Hanumath) వ్యవహారం మీద సినీ సెలబ్రిటీలు ఒక్కరక్కరుగా స్పందిస్తున్నారు. ఓ తండ్రీ కూతురు వీడియో విషయంలో ప్రణీత్, అతని స్నేహితులు చేసిన కామెంట్స్ విషయంలో తొలుత సాయిధరమ్ తేజ్ (Sai dharam Tej) ఫైర్ అవుతూ ఓ పోస్ట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను కోరారు. తదుపరి మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్సేన్, అహితేజ బెల్లంకొండ స్పందించారు. తాజాగా కార్తికేయ (Kartikeya) కూడా స్పందించారు. ఈ విషయం మీద తాను తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
"ఈ ఒక్క కేసు మాత్రమే కాదు. ఇతరుల మీద అనవసరమైన తప్పుడు జోక్స్ వేసుకుంటూ కాలం గడపడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. తమను తాము కూల్, న్యూ ఏజ్ పీపుల్ అని భావిస్తూ ఈ వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను ఎంకరేజ్ చేసిన వాళ్లే వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇకపై అలాంటి కంటెంట్‌ని ఎంకరేజ్ చేయొద్దని నేను సూచిస్తున్నాను. కచ్చితమైన విమర్శలను, ఆరోగ్యకరమైన జోక్స్‌ని ఎవరైనా హర్షిస్తారు. కానీ ఇలాంటి విషయాల మీద కూడా జోక్స్ వేస్తే సమాజంలో మనం వెనక్కి నడుస్తున్నట్టే భావించాలి. ఒకళ్ళని వెనక్కి లాగే ఆలోచన కంటే ఇతరులకు సహాయం చేస్తూ ఒకరితో కలిసి ముందుకు ఎలా వెళ్లాలి అనేలా ఆలోచించాలి. నేను కేవలం ఆ ఒక్క జోక్ మీద మాత్రమే ఖండించడం లేదు. ఎవరైతే దారుణమైన వ్యాఖ్యలతో కామెడీ పుట్టించాలనుకుంటున్నారో వాళ్లందరి అభిప్రాయాలను ఖండిస్తున్నాను’’ అన్నారు.
అయితే దీనిపై పలువురు నెటిజన్లు.. మరి మీరెందుకు అతనికి ఇంటర్వ్యూ ఇచ్చారు అంటూ కార్తకేయకు కౌంటర్ వేశారు. దానికి ఆయన స్పందిస్తూ.. ''అవును నేను వాళ్లకి సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చాను. అందరికీ ఎలా ఇంటర్వ్యూస్ ఇచ్చానో వాళ్ళకి కూడా అలాగే ఇచ్చాను, అయితే అప్పుడు వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు విని కొంచెం షాకయ్యాను. కానీ అప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భావించి నాకు వీలైనంతలో స్పోర్టివ్ గానే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశాను. నిజానికి నేను వాళ్లతో ఇంటర్వ్యూ చేయకుండా ఉండాల్సింది. కానీ హీరోగా సినిమాని ప్రమోట్ చేసుకునే బాధ్యతతో, ఆ సినిమాని ప్రేక్షకులకు చేర వేయాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ ఇచ్చాను. అయితే అలాంటి కంటెంట్‌ని పోస్ట్ చేేస ఉద్దేశం నాకు లేదు. ఆ వీడియోలో నేను కూడా ఉండాల్సి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను. ఇకపై ఈ తరహా ఇంటర్వ్యూలు ఇవ్వను. జాగ్రత్తగా ఉంటాను. హేయమైన వ్యాఖ్యలు చేసే ఇలాంటి వారిని అసలు ఎంకరేజ్ చేయకూడదు. దయచేసి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’’ అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు.