Kannappa Team: మహా కాళేశ్వర్‌.. మళ్లీ ఎందుకు వెళ్లారంటే...

ABN, Publish Date - Nov 28 , 2024 | 09:51 PM

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహా కాళేశ్వర్‌  ఆలయాన్ని ‘కన్నప్ప’ చిత్ర బృందం సందర్శించింది.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహా కాళేశ్వర్‌ 9Mahakaleswar)  ఆలయాన్ని ‘కన్నప్ప’(Kannappa) చిత్ర బృందం సందర్శించింది. మోహన్‌ బాబు(mohanbabi), విష్ణు (manchu vishnu), శరత్‌కుమార్‌ తదితరులు ఉజ్జయిని వెళ్లగా సంబంధిత ఫొటోలు మంచు విష్ణు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శనలో భాగంగా ‘కన్నప్ప’ టీమ్‌ ఉజ్జయినిలోని మహా కాళేశ్వర్‌ ఆలయాన్ని సందర్శించిందని తెలిపారు. ఆ సినిమా విడుదల తేదీని ఇక్కడే ప్రకటించామని గుర్తు చేసుకున్నారు. పరమేశ్వరుడి ఆశీస్సుల కోసం మరోసారి వచ్చామని చెప్పారు.



ధూర్జటి కవి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం లోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన చిత్రమే ‘కన్నప్ప’. విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరించడంతోపాటు కీలక పాత్ర పోషించారు. శరత్‌ కుమార్‌, మధుబాల ప్రీతి ముకుందన్‌ తదితరులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ప్రభాస్‌ అతిథి పాత్రలో  సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25నఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Parvathy Thiruvothu : ఏజెంట్‌ హనీ.. మైండ్‌ బ్లోయింగ్‌: పార్వతి తిరువోతు

Allu Arjun - Drugs: డ్రగ్స్ గురించి అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో



 

Updated Date - Nov 28 , 2024 | 09:51 PM