Shanmukh Jaswanth:అసలు ఏమైంది అనేది త్వరలోనే తెలుస్తుంది
ABN, Publish Date - Feb 23 , 2024 | 03:39 PM
అరె ఏంట్రా ఇది’ అనే డైలాగ్‌లో ఎంతో పాపులర్ అయ్యి, యూట్యూబర్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తున్న షణ్ముఖ్ జశ్వంత్ ను గురువారం నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే! తన సోదరుడు సంపత్ వినయ్‌పై ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు షణ్ను ఇంటికి వెళ్లగా అతను గంజాయి సేవిస్తూ కనిపించాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'అరె ఏంట్రా ఇది’ అనే డైలాగ్‌లో ఎంతో పాపులర్ అయ్యి, యూట్యూబర్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తున్న షణ్ముఖ్ జశ్వంత్ ను (Shanmukh Jaswanth) గురువారం నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే! తన సోదరుడు సంపత్ వినయ్‌పై ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు షణ్ను ఇంటికి వెళ్లగా అతను గంజాయి సేవిస్తూ కనిపించాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్ష చేయగా షణ్ముఖ్ గంజాయి తీసుకున్నట్లు నిర్థారణ అయినట్లు సమాచారం. మరోవైపు షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై ఇప్పటికే చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. షణ్ముఖ్ కేసును వాదించేందుకు ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీస్ సుంకర (Kalyan dilip sunkara) రంగంలోకి దిగారు.
ఈ సందర్భంగా షణ్ముక్ పై గంజాయి కేసు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలపై ఆయన స్పందించారు. ''ఈ కేస్ నేను టేకప్ చేశాను. షణ్ను తండ్రి నా వద్దనే ఉన్నారు. షణ్ముక్ పై మీడియాలో వస్తున్న కథనాలకు వాస్తవానికి ఎటువంటి సంబంధం లేదు. అన్ని ఆధారాలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సమర్పిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను’’ అని ట్వీట్‌లో తెలిపారు. ‘పోలీసులు తమ కోణంలో మాత్రమే కేసు నమోదు చేశారు. ఈ విషయాలను న్యాయస్థానం నిర్థారించాల్సి ఉంటుంది. పోలీసులు షణ్ముఖ్‌ను అరెస్ట్ చేసిన సమయానికి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? దీనికి సంబంధించిన సీసీ పుటేజీ ఉంది. గత కొన్నిరోజులుగా షన్ను ఇంటికి ఎవరెవరు వచ్చారు..? అనే ఆధారాలు ఉన్నాయి. పోలీసుల సేకరించిన ఆధారాలు, మా వద్ద ఉన్నప్రూఫ్స్‌ను కోర్టుకు అందిస్తాం’ అని అన్నారు.