Kalki Ganapati: కల్కి సెట్‌ను పోలిన వినాయక మందిరం.. ఎక్కడంటే..

ABN, Publish Date - Sep 09 , 2024 | 01:05 PM

ప్రతి వినాయక చవితికి ఆది గణపతి (Kalki Ganapayi) పలు రూపాల్లో దర్శనమిస్తుంటారు.


ప్రతి వినాయక చవితికి ఆది గణపతి (Kalki Ganapayi) పలు రూపాల్లో దర్శనమిస్తుంటారు. సినిమా ట్రెండ్‌లో చెప్పాలంటే 'బాహుబలి' వచ్చినప్పుడు బాహుబలి’ లాగా, గబ్బర్‌సింగ్‌ గణేష్‌; ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌, పుష్ప ఇలా విభిన్న అవతారాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి మండపాల్లో ఉంచేవారు. ఈ ఏడాది కూడా మరో కొత్త రూపంలో విఘ్ననాయకుడు (Ganesh festival) దర్శనమిచ్చారు. ఇప్పుడు లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘కల్కి’ వినాయకుడు.  ప్రస్తుతం కల్కి వినాయకుడు విగ్రహాలు వైరల్‌గా మారాయి.



ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ఇందులో అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, యాస్కిన్‌గా కమల్‌హాసన్‌, భైరవ పాత్రలో ప్రభాస్‌ కనిపించి మెప్పించారు. ఈ పాత్రలతో పాటు ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ కల్కి వెహికల్‌ ‘బుజ్జి’ ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే సినిమాను పోలిన ఓ వినాయక మందిరం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో కల్కిసెట్‌లా మందిరం వేశారు. కాంప్లెక్స్‌లో నుంచి లోపలికి వెళ్లేలా డిజైన్‌ చేశారు. లోపల కమల్‌ హాసన్‌ పాత్ర బొమ్మ పెట్టి.. శివుడి విగ్రహం, అశ్వత్థామ వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘పుష్ప2’లోని సూేసకి పాట స్టిల్‌లో వినాయకుడు కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ‘కల్కి’ కాంప్లెక్స్‌లో వినాయకుడిపై మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Sep 09 , 2024 | 01:08 PM