Kalki 2898 AD: టికెట్స్  ధరలు.. ఏపీలో లైన్ క్లియర్ 

ABN, Publish Date - Jun 25 , 2024 | 08:48 AM

ప్రభాస్  (Prabhas) నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్‌ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

ప్రభాస్  (Prabhas) నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్‌ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు (Tickets Rate Hike) అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై 125 రూపాయలు పెంచేందుకు, రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ  హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.


ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. దీపికా పదుకోన్ కథానాయిక.  అమితాబ్  బచ్చన్, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రదారులు. 

Updated Date - Jun 25 , 2024 | 08:54 AM